Ginger Health Benefits: శీతాకాలంలో అల్లమే మీ బెస్ట్ ఫ్రెండ్.. ఈ ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి!

Ginger Health Benefits, Ginger is Helps in fighting cold and flu symptoms. సాధారణంగా అల్లం మంచి రుచిని అందించడమే కాకుండా.. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 26, 2022, 08:24 PM IST
  • ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
  • శీతాకాలంలో అల్లమే మా బెస్ట్ ఫ్రెండ్ అనక మానరు
  • వంట గదిలో 'అల్లం' తప్పక ఉంటుంది
Ginger Health Benefits: శీతాకాలంలో అల్లమే మీ బెస్ట్ ఫ్రెండ్.. ఈ ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి!

Best Ginger Health Benefits in Winter: ప్రతి భారతీయ వంట గదిలో 'అల్లం' తప్పక ఉంటుంది. అల్లం ప్రధానమైన పదార్ధం కాబట్టి తప్పకుండా ప్రతీ వంటింట్లో ఉంటుంది. సాధారణంగా అల్లం మంచి రుచిని అందించడమే కాకుండా.. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. అందుకే చాలా రకాల వంటలలో ఉపయోగిస్తారు. అల్లంను ఎక్కువగా టీలో ఉపయోగిస్తారు. అల్లం సాధారణంగా శీతాకాలపు ఆహారంగా భావించబడుతుంది. చలిని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అల్లం సాయపడుతుంది. శీతాకాలంలో ఆహారంలో అల్లం చేర్చడానికి కారణాలు ఏంటో చూద్దాం. 

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం:
అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిక్ లక్షణాలను నిర్వహించడానికి ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు. అల్లంను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నొప్పి మరియు వాపు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. నోటి ద్వారా తీసుకున్నా లేదా మీ చర్మానికి నేరుగా రాసుకున్నా.. మీ అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

జలుబు మరియు ఫ్లూ:
శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గిన వెంటనే తుమ్ములు మరియు దగ్గు రావడం సాధారణం. జలుబు మరియు ఫ్లూ నివారణగా అల్లంను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. వివిధ వంటకాలలో లేదా పానీయాలలో అల్లం రసం లేదా తురిమిన అల్లం కలపడం ద్వారా ప్రయోజనం ఉపశమనం పొందవచ్చు.

జీర్ణక్రియ:
సహజంగా లభించే జింజెరాల్ అనే పదార్థం అల్లంలో ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి చాలా మంది అల్లంను ఉపయోగిస్తారు.

ముక్కు దిబ్బడ:
చలికాలంలో చాలా మంది వ్యక్తులకు దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ ఓ పెద్ద సమస్యగా ఉంటుంది. అర టేబుల్ స్పూన్ తేనెలో కొన్ని చుక్కల అల్లం రసం వేసి పడుకునే ముందు తాగితే మంచి ఉపశమనం ఉంటుంది. ఒక్క రోజులో మీరు మంచి అనుభూతి చెందుతారు.

కొలెస్ట్రాల్:
అల్లం రోజువారీ తీసుకోవడం ద్వారా మీ చెడు లేదా LDL కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించబడవచ్చు. అల్లం పచ్చడి, అల్లం రసం తీసుకున్నా ఫలితం ఉంటుంది. 

Also Read: Hiccups Home Remedies: ఎక్కిళ్లు వచ్చినపుడు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. వెంటనే ఉపశమనం లభిస్తుంది!  

Also Read: శ్రీలంక సిరీస్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం.. టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌! రోహిత్ ఉన్నా అతడే   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News