Best Diet for Hypothyroidism: థైరాయిడ్‌తో బాధపడేవారు ఇలా చేయండి చాలు.. ఈ సమస్యలకు సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

Best Diet for Hypothyroidism: శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా పని చేయాలంటే తప్పకుండా హార్మోన్ల సహాయం అవసరం అవుతుంది. ఈ హార్మోన్ల ప్రక్రియ సక్రమంగా జరిగితేనే శరీరం ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియ సక్రమంగా లేకపోతే.. హార్మోన్ల పరిమాణం ఎక్కువైతే శరీరంలో చాలా రకాల వ్యాధులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 18, 2022, 05:21 PM IST
  • థైరాయిడ్‌తో బాధపడుతున్నారా..
  • కేవలం హార్మోన్లు మార్పుల వల్లే ఈ సమస్యలు
  • వీరిలో హృదయ స్పందనలో మార్పులు వస్తాయి
Best Diet for Hypothyroidism: థైరాయిడ్‌తో బాధపడేవారు ఇలా చేయండి చాలు.. ఈ సమస్యలకు సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

Best Diet for Hypothyroidism: శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా పని చేయాలంటే తప్పకుండా హార్మోన్ల సహాయం అవసరం అవుతుంది. ఈ హార్మోన్ల ప్రక్రియ సక్రమంగా జరిగితేనే శరీరం ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియ సక్రమంగా లేకపోతే.. హార్మోన్ల పరిమాణం ఎక్కువైతే శరీరంలో చాలా రకాల వ్యాధులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. హార్మోన్ల పరిమాణాలు హెచ్చుతగ్గులు, హార్మోన్లు మార్పుల వల్ల శరీరంలో థైరాయిడ్ సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమస్య బారిన మహిళలు ఎక్కువగా పడడం విశేషం. మహిళల్లో ఈ థైరాయిడ్ సమస్య ఏర్పడితే శరీరంలో మార్పులు కూడా సంభవిస్తాయి. అంతేకాకుండా వీరిలో పది లక్షణాలు కూడా గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆయాసం వస్తుందా..?
థైరాయిడ్ ఉన్న వారిలో ఆయాసం కూడా ఓ ప్రధాన లక్షణం అని చెప్పొచ్చు. దీని తర్వాత అలసట రావడం సర్వసాధారణం. అయితే థైరాయిడ్ ఉన్న వారిలో విశ్రాంతి పొందిన తర్వాత కూడా అలసట వస్తుంది. ఇలాంటి సమస్య ఉంటే తప్పకుండా వైద్యుని సంప్రదించి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి.

బరువు తగ్గడం లేదా పెరగడం:
థైరాయిడ్ వచ్చిన ప్రతి వారిలో వారి శరీర బరువు హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఈ సమస్య ఉన్నవారు కొందరు బరువు పెరిగితే.. మరికొందరు బరువు తగ్గుతారు. అంతేకాకుండా చాలామంది అకస్మాత్తుగా బరువు విపరీతంగా పెరుగుతారు. ఇలాంటి సమస్యలు వస్తే తప్పకుండా థైరాయిడ్ మీలో ఉన్నట్టే. కాబట్టి పలు జాగ్రత్తలు పాటించడం చాలా మేలు.

హృదయ స్పందనలో మార్పులు:
ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో హృదయ స్పందనలో మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరిలో గుండె అతిగా కొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల సంఖ్య అధికంగా అయినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించి.. వారు సూచించిన ఔషధాలను వాడడం చాలా మంచిది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Trending News