Jamun Juice for Diabetic Patients: ప్రస్తుతం నేరేడు పండ్లు అన్ని సీజన్ లలో లభిస్తున్నాయి. అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో వీటి నుంచి తయారుచేసిన జ్యూస్లను కూడా విక్రయిస్తున్నారు. నేరేడు పండ్లు నోటికి రుచిని అందించడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇంకా వీటితో తయారుచేసిన రసాన్ని తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటితో తయారుచేసిన రసంలో పోషక గుణాలు లభించడమే కాకుండా శరీరాన్ని వ్యాధులనుంచి సంరక్షించే శక్తి కూడా ఉంటుందని నిపుణులు అంటున్నారు. నేరేడు పండ్ల రసాన్ని ఎలా తయారు చేయాలో.. ఈ రసం తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మార్కెట్లో అన్ని సీజన్లో నేరేడు పండ్లు లభిస్తున్నాయి. వీటి గింజలు గుజ్జులో చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడేవారు క్రమం తప్పకుండా నేరేడు పండ్లతో తయారుచేసిన రసాన్ని తాగాల్సి ఉంటుంది.
ఈ జ్యూస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
✺ 3 కప్పులు విత్తనాలు తీసిన నేరేడు పండ్లు
✺ 4 చిన్న కప్పుల నీరు
✺ 2 టేబుల్ స్పూన్ల చక్కెర
✺ 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
Also Read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..
నేరేడు పండ్ల జ్యూస్ తయారీ విధానం:
✺ ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు కప్పుల విత్తనాలు లేని నేరేడు పండ్లను వేసుకోవాలి.
✺ ఇలా నేరేడు పనులను వేసుకున్న తర్వాత రెండు కప్పుల నీటిని పోసుకొని రెండు స్పూన్ల చక్కెరను వేసుకోవాలి.
✺ ఇలా మూడింటిని మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్సీ పట్టుకొని జ్యూస్ లా తయారు చేసుకోవాలి.
✺ ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి.. ఆఖరి సారిగా బాగా మిక్స్ చేసుకోవాలి.
✺ అంతే సులభంగా నేరేడు పండ్ల జ్యూస్ తయారైనట్లే..
మధుమేహంతో బాధపడుతున్న వారికి ఔషధంలా పనిచేస్తుంది:
నేరేడు పండ్లలో ఉన్న గుణాలు మధుమేహం ఉన్నవారికి ప్రభావంతంగా సహాయపడతాయి. నేరేడు పండ్లతో తయారు చేసిన రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటి గింజలతో తయారు చేసిన పొడిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల కూడా శాశ్వతంగా మధుమేహం నుంచి ఉపశమనం పొందవచ్చు.
Also Read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Jamun Juice for Diabetic Patients: డయాబెటీస్ కు శాశ్వతంగా బైబై చెప్పాలా..? అయితే నేరేడు పండ్ల రసం తాగండి