Belly Fat Reduce In 7 Days: పొట్ట చుట్టు కొలెస్ట్రాల్ పరిమాణాలు అధికంగా పెరగడం వల్ల లావుగా, బొద్దుగా కనిపిస్తూ ఉంటారు. ఇలా కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె పోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొందరు కఠిన వ్యాయామాలు కూడా చేస్తారు. ఇలా చేయడం శరీరానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణలు తెలుపుతున్నారు. అయితే పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఇలా చేయండి:
డ్యాన్స్ చేయడం వల్ల కూడా ఈ సమస్య దూరమవుతుంది:
ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతున్నారు. పెరుగుతున్న ఈ ఫ్యాట్ కారణంగా కొలెస్ట్రాల్, హై బీపీ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఆహార నియమాలతో పాటు.. ప్రతి రోజూ వ్యాయామాలతో కూడిన డ్యాన్స్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ స్థాలను తగ్గించుకోవడానికి తప్పకుండా డ్యాన్స్ చేయాలి.
సైక్లింగ్ చేయండి:
బరువు తగ్గడానికి అందరూ సైక్లింగ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గడమేకాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా కరుగుతాయి. పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించుకోవడానికి తప్పకుండా ప్రతి రోజూ ఉదయం సైక్లింగ్ చేయండి.
రోజూ ఇలా వ్యాయామం చేయండి:
బొడ్డు కొవ్వును తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం క్రంచెస్ చేయడం వల్ల కూడా సులభంగా తగ్గించుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. క్రంచెస్ వ్యాయామం చేస్తే ఆరోగ్యంతో పాటు సులభంగా బరువు తగ్గొచ్చు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook