Belly Fat Burn Drink: ఆధునిక జీవన విధానంలో స్థూలకాయం లేదా అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతోంది. దీనికితోడు బరువు పెద్దగా లేకున్నా బెల్లీ ఫ్యాట్ సమస్య ఇబ్బందికరంగా మారుతోంది. పొట్ట, నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు నలుగురిలో అసౌకర్యం కల్గించడమే కాకుండా అనారోగ్యానికి కూడా దారి తీస్తుంది.
మనిషి పుట్టిన తరువాత వయస్సు పెరిగే కొద్దీ స్థూలకాయం, అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ లేదా ఫిట్‌నెస్ కన్పిస్తుంటుంది. ఆహారపు అలవాట్లు, జీవనవిధానం సరిగ్గా లేకపోతే బెల్లీ ఫ్యాట్, స్థూలకాయం వంటి సమస్యలు వెంటాడుతాయి. పొట్టలో అనవసరపు కొవ్వు పేరుకుపోవడం వల్లనే బెల్లీ ఫ్యాట్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను ఎప్పటికప్పుడు తగ్గించుకోకపోతే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.
బెల్లీ ఫ్యాట్ సమస్య తగ్గించేందుకు వ్యాయామం ఒక్కటే చాలదు. వ్యాయామంతో పాటు కొన్ని రకాల డ్రింక్స్ తాగవల్సి ఉంటుందని ఆయుర్వే శాస్త్రం చెబుతోంది. దీనికి సరైన ప్రత్యామ్నాయం నిమ్మకాయ-అల్లం డ్రింక్. కేవలం ఐదురోజుల్లో ఫలితం గమనించవచ్చు. అల్లంలో ఉండే జింజెరోల్స్, షోగౌల్స్ శరీరంలో అంతర్గతంగా తలెత్తే మంటను తగ్గిస్తాయి. జీర్ణక్రిను మెరుగుపరుస్తాయి. అదే సమయంలో ఆకలి కూడా తగ్గుతుంది. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి కారణంగా ఆకలి చాలావరకూ తగ్గుతుంది.
ఓ నిమ్మకాయ రసాన్ని పిండి గిన్నెలో వేసుకోవాలి. ఇందులో చిన్న అల్లం ముక్కముక్కలుగా కోసి అందులో కలిపి మూడు కప్పుల నీరు పోయాలి. ఇప్పుడీ మిశ్రమాన్ని 10-15 నిమిషాలు ఉడికించాలి. రుచి కోసం తేనె కలుపుకోవచ్చు. రోజుకు మూడుసార్లు తాగితే కేవలం ఐదు రోజుల్లో బెల్లీ ఫ్యాట్ అత్యంత సులభంగా కరిగిపోతుంది.
Also read: Lemon Peel Uses: నిమ్మకాయ తొక్కతో బోలెడు లాభాలు, ఈ తొక్కలతో ఇలా చేయండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook