Beetroot Juice: బీట్‌రూట్ జ్యూస్ రోజూ పరకడుపున తాగితే...ప్రయోజనాలివే, ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు

Beetroot Juice: బీట్‌రూట్..చాలామందికి ఇష్టముండదు. బీట్‌రూట్ అంటే ఎంత ఇష్టముండదో అంతగా ప్రయోజనం ఉంటుంది మరి. అందుకే ఇష్టం లేకపోయినా తీసుకోక తప్పదు. ఆ ప్రయోజనాలేంటో చూద్దామా

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 3, 2021, 11:12 PM IST
Beetroot Juice: బీట్‌రూట్ జ్యూస్ రోజూ పరకడుపున తాగితే...ప్రయోజనాలివే, ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు

Beetroot Juice: బీట్‌రూట్..చాలామందికి ఇష్టముండదు. బీట్‌రూట్ అంటే ఎంత ఇష్టముండదో అంతగా ప్రయోజనం ఉంటుంది మరి. అందుకే ఇష్టం లేకపోయినా తీసుకోక తప్పదు. ఆ ప్రయోజనాలేంటో చూద్దామా

నిత్యజీవితంలో ఎదురయ్యే చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది బీట్‌రూట్ సాధారణంగా  హిమోగ్లోబిన్ పెరగడానికే అనుకుంటాం గానీ ఇదొక దివ్య ఔషధమని చాలామందికి తెలియదు. బీట్‌రూట్(Beetroot)అంటే ఎంతగా ఇష్టముండదో..ప్రయోజనాలు అన్ని ఉన్నాయి. అందుకే ఇష్టం లేకపోయినా తీసుకోక తప్పదు. తినలేకపోతే జ్యూస్ చేసుకునైనా తాగండి. అది కూడా ఎలాగో తెలుసా. పరకడుపున రోజూ తాగితే కలిగే ప్రయోజనాలు ( Beetroot juice benefits)అన్నీ ఇన్నీ కావు. బీట్‌రూట్‌లో మీకు తెలియని చాలా ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయి. 

రక్తహీనతతో బాధపడే వారు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే  మంచి ఫలితం ఉంటుంది. రక్తం చాలా త్వరగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి త్వరిత కాలంలోనే బయట పడవచ్చు. ఇక ఇంట్లో పనుల వల్ల రోజంతా నీరసంగా ఉండేవారు ప్రతిరోజూ ఉదయం బీట్‌రూట్‌ జ్యూస్‌(Beetroot juice)తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. శక్తి అందుతుంది. దాంతో చురుగ్గా ఉంటారు. ఏ పనైనా చేయగలుగుతారు. హైబీపీ ( High Blood Pressure) ఉన్నవారికి బీట్‌రూట్‌ ఒక ఔషధమనే చెప్పాలి. బీట్‌రూట్‌లో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.

ఇక కొలెస్ట్రాల్‌ అధికంగా ఉన్నవారు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే మంచిది. కొలెస్ట్రాల్‌ కరగడంతో పాటు బరువు కూడా తగ్గుతారు. గర్భిణీలు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల..కడుపులో ఉండే బిడ్డకు మెరుగైన ఫోలిక్‌ యాసిడ్‌ (Folic acid) అందుతుంది. ఫలితంగా బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. లివర్‌ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా రోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం మంచిది. దీంతో లివర్‌‌లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోయి..లివర్ శుభ్రమవుతుంది. క్రమం తప్పకుండా బీట్‌రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకుంటే కొంతకాలానికి మీకు తెలియకుండానే మీలో జ్ఞాపకశక్తి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Also read: COVID-19 Vaccine: కరోనా టీకాలు తీసుకున్న వారిలో ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News