Beauty tips: ఈ చిట్కాలతో.. మొటిమల సమస్యకు ఇంట్లోనే చెక్​ పెట్టొచ్చట!

Beauty tips: చాలా మందికి మొటిమల సమస్య ఉంటుంది. చాలా మంది ఈ సమస్యను తగ్గించుకునేందుకు భారీగా ఖర్చు చేస్తుంటారు. అలాంటి వారికోసం ఇంట్లోనే మొటిమలు తగ్గింకునేందుకు ఉపయోగపడే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 12:26 PM IST
  • ఇంట్లోనే మొటిమల సమస్యకు చెక్​
  • సులభంగా లభించే పదార్థాలే ఔషధాలు
  • యువతకు ఎంతగానో ఉపయోగపడే టిప్స్​
Beauty tips: ఈ చిట్కాలతో.. మొటిమల సమస్యకు ఇంట్లోనే చెక్​ పెట్టొచ్చట!

Beauty tips: యువతకు ఎప్పుడు ఫెయిర్​గా కనిపించాలని ఉంటుంది. ముఖంలో ఆకర్షణీయంగా ఉండేందుకు ఎన్నో క్రీమ్స్​ వాడుతుంటారు కూడా. అయితే చాలా మందిని వేదించే సమస్య ఏమిటంటే.. మొటిమలు. మొటిమలు వచ్చిన వాళ్లంతా ఎన్నో క్రీమ్స్​ వంటివి వాడుతుంటారు. క్రీమ్స్ వాడినా.. కొన్ని సార్లు మొటిమలు తగ్గి.. మచ్చలు మాత్రం అలానే మిగులుతున్నాయి. మరి మొటిమలు, మచ్చల సమస్యకు సులభమైన పరిష్కారాలు మీకోసం.

మొటిమల సమమస్యకు ఇంటి చిట్కాలు..

మొటిమల సమస్య ప్రారంభ దశలో ఇంటి చిట్కాలు చాలా బాగా పని చేస్తాయి. రాత్రిపూట వెల్లుల్లి రసాన్ని మొటిమలకు రాసుకుని పడపుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం ద్వారా మొటమలు మాయమవుతాయి.

మొటిమలు పోయినా.. వాటి వల్ల ఏర్పడిన మచ్చలు అలానే ఉంటే వాటిని తొలగించేందుకు బొప్పాయి గుజ్జులో ఆముదం కలిపి రాసుకోవాలి. పడుకునే ముందు రెండు వారాలు ఇలా చేయడం ద్వారా మచ్చలు తగ్గిపోతాయి.

ముఖంపై ఎక్కవగా మొటిమలు ఉన్న వారికి టమాటా, బొప్పాయిల మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం టమాటా రసాన్ని బొప్పాయి గుజ్జుతో కలిపి.. కాస్త తేనను కూడా ఆ మిశ్రమానికి కలపాలి. ఆ తర్వాత దానిని ముఖంపై రుద్దాలి. అలా వారంలో రెండు నుంచి మూడు సార్లు చేయాలి. అలా మొటిమలు తగ్గినట్లు మీరే గుర్తిస్తారు.

Also read: Liquid Food Items: వేసవిలో తప్పకుండా తీసుకోవల్సిన ద్రవపదార్ధాలు, కలిగే ప్రయోజనాలు

Also read: Glowing Skin Tips: వేసవిలోనూ కాంతివంతమైన చర్మసౌందర్యం కోసం ఈ టిప్స్ పాటించండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News