Weight Loss Tips: బరువు తగ్గే క్రమంలో ఈ మూలికలను వినియోగిస్తే చాలు.. కేవలం 5 రోజుల్లో బరువు తగ్గుతారు..

Ayurvedic Herbs For Weight Loss: బరువు పెరగడం వల్ల భవిష్యత్‌లో త్రీవ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి బరువు పెరగడం శరీరానికి హానికరమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగడం వల్ల గుండె సమస్యలు, మధుమేహం సమస్యలు, మూత్రపిండాల సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2022, 05:54 PM IST
  • బరువు తగ్గాలనుకుంటున్నారా..
  • త్రిఫల పొడిని ఆహారంలో వినియోగించండి.
  • ఇలా చేస్తే కేవలం 5 రోజుల్లో బరువు తగ్గుతారు.
Weight Loss Tips: బరువు తగ్గే క్రమంలో ఈ మూలికలను వినియోగిస్తే చాలు.. కేవలం 5 రోజుల్లో బరువు తగ్గుతారు..

Ayurvedic Herbs For Weight Loss: బరువు పెరగడం వల్ల భవిష్యత్‌లో త్రీవ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి బరువు పెరగడం శరీరానికి హానికరమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగడం వల్ల గుండె సమస్యలు, మధుమేహం సమస్యలు, మూత్రపిండాల సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. బరువు తగ్గడానికి పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జీవన శైలిలో మార్పులు తీసుకునే ఆహారంలో పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నియమాలు పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు అంటున్నారు.

బరువు తగ్గడానికి ఆయుర్వేద శాస్త్రంలో చాలా చిట్కాలున్నాయి. అయితే బరువు తగ్గడానికి సహాయపడే కొన్ని రకాల ఆయుర్వేద మూలికలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో ఉండే గుణాలు శరీరంలో చక్కెర పరిమాణాలను నియంత్రించి, పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించుకోవచ్చు. అయితే దీని కోసం సుగంధ ద్రవ్యాలను ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి ఆయుర్వేద మూలికలను వినియోగించండి:

1. త్రిఫల:

త్రిఫల జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో శరీరాని అవసరమైన చాలా రకాల మూలకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని బరువు తగ్గడానికి వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో సమృద్ధిగా లభించే యాంటీఆక్సిడెంట్లు జీవక్రియ రేటును వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా  కొవ్వును నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా  కొవ్వు కణాలలో ఉండే టాక్సిన్స్‌ను తొలగించి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడుతుంది.

2. అల్లం:
అల్లంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ముఖ్యంగా శరీరంపై వచ్చే వాపును తగ్గించి శరీర సమస్యలకు చెక్‌ పెడుతుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అతిగా ఉంటాయి. కాబట్టి కొలెస్ట్రాల్‌ స్థాయిలను సులభంగా తగ్గించేందుకు సహాయపడుతుంది. కాబట్టి అల్లంతో చేసి ఆహారాలను, ముఖ్యంగా టీను అతిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

3. దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కలో చాలా రకాల మూలికలు ఉంటాయి. ముఖ్యంగా జీవక్రియ రేటును పెంచడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి దీనిని పొడిలా చేసుకుని టీలో వేసుకుని తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అయితే దీనిని రెగ్యులర్ వాడడం వల్ల సులభంగా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి బరువును కూడా తగ్గిస్తాయి.

Also Read : Nagarjuna: సినీ నటుడు నాగార్జున రాజకీయాల్లో వస్తున్నారా..? ఆయన ఏమన్నారంటే..!

Also Read : Sri Reddy on Bigg Boss: నేను ఛస్తే వెళ్లను.. నాగార్జున రంగేసుకుని ఎలా చేస్తున్నారు.. బిగ్ బాస్ పై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News