Apple Peel Benefits: యాపిల్‌ను తొక్క తీసి తింటున్నారా..అయితే అలా తినకండి..!!

Apple Peel Benefits: రోజూ ఒక యాపిల్(Apple) తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని తరచుగా పెద్దలు చెబుతూ ఉంటారు. అవును నిజమే యాపిల్ చాలా రకాల పోషకాలుంటాయి. ఇవి శరీరాన్ని దృఢంగా చేయడమే కాకుండా మంచి పోషక విలువలను అందిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 11:26 AM IST
  • యాపిల్‌ను తొక్క తీసి తింటే శరీరానికి విటవిన్లు అందవు
  • గుజ్జు కంటే ఎక్కువ తొక్కలోనే అధిక విటవిన్లు
  • యాపిల్‌లో దాదాపు 4.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది
Apple Peel Benefits: యాపిల్‌ను తొక్క తీసి తింటున్నారా..అయితే అలా తినకండి..!!

Apple Peel Benefits: రోజూ ఒక యాపిల్(Apple) తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని తరచుగా పెద్దలు చెబుతూ ఉంటారు. అవును నిజమే యాపిల్ చాలా రకాల పోషకాలుంటాయి. ఇవి శరీరాన్ని దృఢంగా చేయడమే కాకుండా మంచి పోషక విలువలను అందిస్తుంది. ఈ పండులో ఉండే గుణాలు వల్ల శరీరానికి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. అందుకే ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి డాక్టర్లు యాపిల్ పండ్లను తినమని సూచిస్తారు. అయితే ఈ పండును తినడానికి ముందు చాలా మంది దాని పై తొక్కను తీసివేస్తున్నారు. దీని కారణంగా శరీరానికి వచ్చే ప్రయోజనాలు రావడం లేదు. ఇలా చేయడం ద్వారా ఎన్ని విటవిన్లు కోల్పోతారో తెలుసుకుందాం.

యాపిల్‌ పీల్స్‌లో అధిక మొత్తంలో ఉర్సోలిక్ యాసిడ్ ఉంటుంది. దీని వల్ల శరీరంలోని చెడు కొవ్వు తొలిగిపోయి..బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా పొట్ట కొవ్వును తగ్గించి బరువును వేగంగా తగ్గించడంలో సహాయపడుతుంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు యాపిల్స్‌ను వాటి పీల్స్‌తో తినాలని ఆరోగ్య నివుణులు తెలుపుతున్నారు. దీని పీల్స్‌లో ఉండే క్వెర్సెటిన్ అనే మూలకం శ్వాస సమస్యలను తొలగిపోతాయి. అంతుకే వైద్యులు ఎల్లప్పుడూ యాపిల్‌ను వాటి తొక్కలతో తినమని సూచిస్తున్నారు. ఎందుకంటే మొత్తం ఆపిల్‌లో 8.5 మిల్లీగ్రాముల విటమిన్ సి,  98 యూనిట్ల విటమిన్ ఎ ఉంటుంది. పై తొక్కను తొలగించడం వల్ల 8.5 మిల్లీగ్రాముల నుంచి 6.5 వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మధ్యస్థ పరిమాణంలో ఉండే యాపిల్‌లో దాదాపు 4.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అయితే ఈ యాపిల్ పై తొక్కను తీసివేస్తే.. ఈ పండులోని ఫైబర్ మొత్తం 2 గ్రాములు మాత్రమే ఉంటుంది. అంటే యాపిల్ తొక్కలో ఆరోగ్యానికి అవసరమైన గుజ్జు కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. కావున దీనిని తీసివేసి తినడం వల్ల శరీరానికి అధిక స్థాయిలో పోషకాలు అందవు.  అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీ పరిశోధనలో యాపిల్ తొక్కతో తింటే కడుపు, కాలేయం, రొమ్ము క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేసే నాళాలను తొలగించి.. ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొంది.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Green Chillies Benefits: పచ్చిమిర్చితో కలిగే ఆ ఐదు ప్రయోజనాలు తెలిస్తే..ఇక వదిలిపెట్టరు

Also Read: Weight Loss Mistakes: రోజూ ఇలా వ్యాయమం చేసిన బరువు తగ్గడం లేదా..అయితే ఈ పని చేయండి..!! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News