/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

 

Appple Fruit Health Maggic In Telugu: ప్రతిరోజు ఒక యాపిల్ పండును తినడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే.  ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్స్ కి చాలామంది డాక్టర్లు రోజు ఉదయాన్నే ఒక యాపిల్ పండు తినమని సూచిస్తారు. నిజానికి యాపిల్ లో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి టిఫిన్ చేసి ముందు ఈ పండును తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తరచుగా జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు రోజు ఉదయాన్నే ఈ పండును తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు శరీర అభివృద్ధికి కూడా తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఒక యాపిల్ పండు తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

1. పోషకాలు: 
యాపిల్స్ లో అధిక పరిమాణంలో ఫైబర్ తో పాటు విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించేందుకు ఎంతగానో సహాయపడతాయి దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

2. జీర్ణవ్యవస్థకు మేలు: 
యాపిల్‌లో ఉండే ఫైబర్ అనేక రకాల పొట్ట సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మలబద్ధకంతో పాటు ఇతర జీర్ణ క్రియ సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు ఎంతగానో సహాయపడుతుంది.

3. బరువు తగ్గించేందుకు:
 యాపిల్ తినడం వల్ల ఆకలి కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్ పండు తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తాయి. 

4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: 
యాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతిరోజు యాపిల్ పండును తినడం వల్ల గొప్ప రక్షణ పొందుతారు. 

5. గుండె ఆరోగ్యానికి మేలు: 
యాపిల్‌లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు రోజు ఉదయం పూట ఒక యాపిల్ పండును తినడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

6. మెదడు ఆరోగ్యానికి: 
యాపిల్‌లో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మెదడులోని కణాలను మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి తరచుగా జ్ఞాపకశక్తి లోపం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా రోజు ఆపిల్ తినండి.

7. చర్మ ఆరోగ్యానికి మేలు: 
యాపిల్‌లో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు శరీరంలో పేరుకుపోయిన క్యాన్సర్ కణాలను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Apple Fruit Magic: Apple Fruit Health Magic Be Sure To Know This In Telugu Dh
News Source: 
Home Title: 

Appple Fruit Maggic: యాపిల్ పండా మజాకా.. రోజు తింటే.. జీవితాంతం హాస్పిటల్‌కి వెళ్ళిన అక్కర్లేదు..

Appple Fruit Maggic: యాపిల్ పండా మజాకా.. రోజు తింటే.. జీవితాంతం హాస్పిటల్‌కి వెళ్ళిన అక్కర్లేదు..
Caption: 
source file- zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
యాపిల్ పండా మజాకా.. రోజు తింటే.. జీవితాంతం హాస్పిటల్‌కి వెళ్ళిన అక్కర్లేదు..
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Monday, September 9, 2024 - 18:20
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
8
Is Breaking News: 
No
Word Count: 
361