Green Apple Benefits: గ్రీన్ ఆపిల్ ప్రయోజనాలు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

ఆపిల్ వలన ఆరోగ్యకర ప్రయోజనాలా గురించి మనకు తెలిసిందే! రెడ్ ఆపిల్స్ కాకుండా గ్రీన్ ఆపిల్స్ వలన కలిగే లాభాల గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపడతారు. ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో మీరే చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 3, 2023, 05:08 PM IST
Green Apple Benefits: గ్రీన్ ఆపిల్ ప్రయోజనాలు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

Green Apple Benefits: ప్రతి రోజు ఒక ఆపిల్ తినడం వల్ల డాక్టర్‌ కి దూరంగా ఉండవచ్చు అంటూ ఉంటారు. ఆరోగ్యానికి అద్భుత ఔషదం ఆపిల్ అనడంలో సందేహం లేదు. యాపిల్‌ లో ఉండే పోషకాలు మరియు ఇతర హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇప్పటి వరకు మనం చాలా సార్లు చూశాం. అయితే ఎరుపు ఆపిల్స్‌ తో పోల్చితే గ్రీన్ ఆపిల్స్ తో రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

ముఖ్యంగా పలు ప్రమాదకర వ్యాధులు మరియు అనారోగ్య సమస్యల నుండి గ్రీన్ ఆపిల్ బయట పడేస్తుంది. అంతే కాకుండా అలాంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు కాకున్నా కనీసం వారం లేదా పది రోజులకు ఒక గ్రీన్ ఆపిల్‌ చొప్పున తింటే ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

గ్రీన్ ఆపిల్‌ ప్రయోజనాల విషయానికి వస్తే..

గ్రీన్ ఆపిల్స్ రోజు తినే వారికి యాంటీ ఆక్సిడెంట్లు మరియు డీటాక్సిఫైయింగ్‌ ఏజెంట్లు ఎక్కువగా ఉంటాయి. అవి శరీరం నుండి టాక్సిన్స్ ను బయటకు పంపిస్తాయి. తద్వారా హెపాటిక్ పరిస్థితి నుండి కాలేయాన్ని కాపాడుతుంది. అందుకే గ్రీన్ ఆపిల్ కాలేయానికి ప్రయోజనకారి అనడంలో సందేహం లేదు. 

గ్రీన్ ఆపిల్ తినడం వల్ల మానసికంగా దృడంగా మారడంతో పాటు పలు మానసిక సమస్యల నుండి కూడా దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధి ఉన్న వారు గ్రీన్ ఆపిల్‌ తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. 

Also Read: Reduce Belly Fat: బెల్లీ ఫ్యాట్‌, బరువును తగ్గించే జ్యూస్ ఇదే.. ప్రతిరోజు ఖాళీ కడుపుతో తాగితే చాలు, 20 రోజుల్లో ఫలితం మీ సొంతం..

ఇంకా ఎముకల పటుత్వం కోసం, జీర్ణ క్రియ మెరుగు పడటం కోసం, కంటి చూపు మెరుగు పడటం కోసం లేదంటే కంటి చూపు తగ్గకుండా ఉండటం కోసం కూడా గ్రీన్‌ ఆపిల్స్ ఉపయోగపడుతాయి. క్రమం తప్పకుండా గ్రీన్ ఆపిల్స్ తినడం వల్ల ఊరిపితిత్తుల్లో ఉండే చెడు పదార్థాలు మరియు ఇతర అనారోగ్య సంబంధిత కారకాలు తొలగి పోతాయి అంటూ ప్రయోగాత్మకంగా నిరూపితం అయ్యిందని వైద్యులు పేర్కొన్నారు. మొత్తానికి ఎర్రటి ఆపిల్స్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు గ్రీన్ యాపిల్స్ కూడా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అంటూ నిపుణులు చెబుతున్నారు.

Also Read: Belly Fat Reduction Tips: బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించే డికాషన్ ఇదే.. 10 రోజుల్లో బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ట్రై చేయండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News