Aloe Vera Health Benefits: అలోవెరా జ్యూస్ ఆరోగ్యానికి అంత మంచిదా..!

Aloe Vera juice for weight loss: అలోవెరా జ్యూస్‌ శరీర బరువును తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2022, 04:46 PM IST
  • అలోవెరా జ్యూస్‌తో ఆరోగ్యానికి ఎంతో మేలు
  • అధిక బరువును తగ్గించడంలో అలోవెరా జ్యూస్ బాగా పనిచేస్తుంది
  • అలోవెరా జ్యూస్ ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకోండి
Aloe Vera Health Benefits: అలోవెరా జ్యూస్ ఆరోగ్యానికి అంత మంచిదా..!

Aloe Vera juice for weight loss: పర్ఫెక్ట్ ఫిజిక్‌ను మెయింటైన్ చేయాలంటే పర్ఫెక్ట్ డైట్‌తో పాటు రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేయాలి. ఈ రెండింటిలో దేని పట్ల కాస్త అశ్రద్ధ వహించినా.. ఇట్టే లావెక్కిపోతారు. ఒక్కసారి బరువు పెరిగాక.. మళ్లీ తగ్గాలంటే చాలానే శ్రమించాల్సి వస్తుంది. లైఫ్ స్టైల్‌లో పూర్తిగా మార్పులు చేసుకుంటేనే అది సాధ్యమవుతుంది. ముఖ్యంగా తినే ఆహారంలో మార్పులు అవసరం. పోషకాలు ఎక్కువగా ఉండే హెల్తీ డైట్‌ను మాత్రమే తీసుకోవాలి.

కొన్ని రకాల సూపర్ ఫుడ్స్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. అందులో అలోవెరా ఒకటి. దీన్ని ఇంట్లోనే పెంచుకోవచ్చు కాబట్టి ప్రతీ రోజూ ఫ్రెష్ అలోవెరాను ఉపయోగించవచ్చు. రుచికి ఇది చేదుగా ఉన్నప్పటికీ.. శరీర శోషణ, పోషణను ఇది మెరుగుపరుస్తుందని 'ది ఎవ్రీథింగ్ గైడ్ టు అలోవెరా' రచయిత బ్రిట్ బ్రాండన్ చెబుతున్నారు. అలోవెరాలో ఉండే విటమిన్ ఏ, బీ, సీ, ఈ, ప్రోటీన్లలో 18 అమైనో యాసిడ్లు ఉంటాయి. అలోవెరా జెల్‌లో ఉండే మరో ముఖ్యమైన పోషకం ఎసిమన్నన్ అని పిలువబడే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. ఇవి శరీరంలోని ట్యాక్సిన్లను బయటకు పంపించి జీవక్రియలను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడంలో దోహదపడుతాయి.

అలోవెరా జ్యూస్ తయారీ విధానం

అలోవెరా కాండం కింది భాగాన్ని కత్తిరించివేయండి. ఆ తర్వాత దాని ఆకులను మధ్యలోకి తుంచి.. అందులో నుంచి జెల్ బయటకు తీయండి. ఆ జెల్ మొత్తాన్ని గ్రైండర్‌లో వేసి మిక్సీ పట్టండి. అందులో నిమ్మరం, తేనె, పొడి చేసి బెల్లం కొద్ది మొత్తంలో కలపండి. ఆ తర్వాత కొద్దిగా చల్లని నీరు పోసి గ్రైండ్ చేయండి. పెనంపై జీలకర, ఎండుమిర్చిని దోరగా వేయించి.. గ్రైండర్‌లో వేసి గ్రైండ్ చేయండి.

ఆ తర్వాత దాన్ని గ్రైండర్‌లో నుంచి ఒక గ్లాసులో పోసి.. దానికి చాట్ మసాలా కలపాలి. అంతే అలోవెరా జ్యూస్ రెడీ. ఈ జ్యూస్‌లో వాటర్‌కు బదులు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కూడా కలుపుకోవచ్చు. ఫస్ట్ రెండు సిప్పులు అలోవెరా జ్యూస్ కాస్త చేదుగా అనిపించినప్పటికీ.. ఆ తర్వాత అది మీకు నచ్చి తీరుతుంది. 

Also Read: IND Playing XI vs WI: చహర్ ఔట్.. శార్ధూల్‌ ఇన్! అయ్యర్, రుతురాజ్‌లకు నిరాశే! రెండో టీ20లో బరిలోకి దిగే భారత జట్టిదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News