Ajwain Leaves Tea Benefits: శరీరంలో ముఖ్యపాత్ర వహించే అవయవాలు ఊపిరితిత్తులు ఒకటి. ఆధునిక జీవనశైలిని అనుసరించే చాలామందిలో ఊపిరితిత్తుల సమస్యలైన ఆస్తమా, దగ్గు ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వానాకాలంలో ఊపిరితిత్తుల సమస్యల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది. కాబట్టి తరచుగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిని వినియోగించడం వల్ల వర్షాకాలంలో ఎలాంటి ఫలితాలు ఉండడం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించే వాము ఆకును వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో తేమ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కీలక పోషిస్తాయి.
Also Read: Salaar Teaser: సలార్ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!
ముఖ్యంగా ఆస్తమాతో బాధపడుతున్న వారు ఈ వామాకును వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దీనికోసం వాము ఆకులతో తయారు చేసిన దీని ప్రతిరోజూ తాగాల్సి ఉంటుంది. ఈ టీని తయారు చేయడానికి ముందుగా పచ్చి వామాకులను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ పై బౌల్ పెట్టి రెండు గ్లాసుల నీటిని మరిగించాల్సి ఉంటుంది. ఇలా మరిగించిన తర్వాత అందులో వామాకులను వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత చల్లార్చుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ టీని తాగితే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
వాము ఆకులతో తయారుచేసిన టీ ని ప్రతిరోజు తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి సులభంగా విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యంగా శరీర బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ ని ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: Salaar Teaser: సలార్ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook