Hair Fall: హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టాలంటే...వీటిని ఆహారంలో చేర్చుకోండి!

Hair Fall Diet Tips: మారుతున్న జీవనశైలి, పోషకాల కొరత కారణంగా.. జుట్టు రాలడం సాధారణ సమస్యగా మారిపోయింది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. ఈ పుడ్ ను మీ డైట్‌లో చేర్చుకోండి.    

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2022, 01:15 PM IST
Hair Fall: హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టాలంటే...వీటిని ఆహారంలో చేర్చుకోండి!

Hair Fall Diet Tips For Growth: హెయిర్ ఫాల్ సమస్య (Hair Fall Problem) సర్వసాధారణమైపోతోంది. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి జుట్టు రాలడానికి ముఖ్యమైన కారణాలు. కాబట్టి మీరు మీ డైట్‌లో ఈ ఆహారాలను చేర్చుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. 

డ్రై ఫ్రూట్స్‌ను చేర్చుకోండి
చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టేందుకు షాంపూలు, కండీషనర్‌లు వాడతారు. కానీ దీని వల్ల అంత ప్రయోజనం ఉండదు.నిజానికి శరీరంలో పోషకాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, మీరు మీ రోజువారీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్ (Dry Fruits) తప్పనిసరిగా చేర్చుకోవాలి, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్‌లో ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-3, విటమిన్ ఇ మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును బలంగా మార్చడంలో సహాయపడుతుంది.

జుట్టు పెరగాలంటే గుడ్డు తినండి
జట్టు పెరగాలంటే..మీరు గుడ్లను (Eggs) తినాలి. ఎందుకంటే గుడ్లలో పెద్ద మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది జుట్టును బలంగా మార్చడంలో సహాయపడుతుంది.

డైట్‌లో సీఫుడ్‌ని చేర్చండి
జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా సీఫుడ్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. సీఫుడ్ (Sea Food) తీసుకోవడం వల్ల మీ జుట్టు దృఢంగా ఉంటుంది. సాల్మన్ , హిల్సా వంటి సముద్రపు చేపలలో పెద్ద మొత్తంలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి, ఒమేగా -3 ఉంటాయి. ఇది జుట్టు మరియు చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

Also Read: Kidney Health: మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..రోజూ నిమ్మరసం ఇలా తాగండి చాలు 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Trending News