Health Benefits of Carrots | ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్ని అందించే క్యారెట్‌ను మనం ఇష్టంగా తింటాం. కొందరు కూర చేస్తే, మరికొందరు జ్యూస్ చేసుకుని తాగుతారు. మరికొందరు క్యారెట్‌ను నేరుగా తినేస్తారు. అయితే క్యారెట్ (Carrots) తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌లు పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజూ క్యారెట్ తింటే కాలేయ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి కొన్ని రకాల క్యాన్సర్ మీ దరిచేరదు. ముఖ్యంగా పరగడుపున (ఖాళీ కడుపుతో) క్యారెట్ (Carrot Benefits) తింటే చాలా ప్రయోజనాలున్నాయి. కొత్తిమీర అని తీసి పారేయొద్దు.. ఈ ప్రయోజనాలు తెలుసా!
క్యారెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే (Health Benefits of Eating Carrots)
- రోజూ ఓ క్యారెట్ తింటే కంటి చూపు (Eye Sight) మెరుగవుతుంది
- క్యారెట్ మన ఒంట్లోని కొవ్వును కరిగిస్తుంది. దీంతో మీరు యాక్టీవ్‌గా ఉండేలా చేస్తుంది.
- క్యారెట్‌లో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ చర్మ సమస్యలను నివారిస్తుంది.
- దీనిలో ఉండే సోడియం అధిక రక్తపోటును (High Blood Pressure) నియంత్రిస్తుంది. ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి
- తరచుగా క్యారెట్ తింటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
- ప్రతిరోజూ క్యారెట్ తినడం వల్ల రోగనిరోధక శక్తిని (Boosts the Immunity System) పెంచుతుంది
- క్యారెట్‌లో ఉండే విటమిన్లు, కార్బైడ్స్ మీ జట్టు పొడిబారకుండా చేస్తుంది.
- తక్షణం శక్తిని అందించే వాటిలో క్యారెట్ ఒకటి. కాస్త అలసటగా అనిపించిననప్పుడు క్యారెట్ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. సులువుగా రోగ నిరోధకశక్తిని పెంచే చిట్కాలు
- ఎముకలకు మరింత బలాన్ని, గట్టిదనాన్ని క్యారెట్ అందిస్తుంది
- కొందరు బరువు తగ్గడానికి (Weight Loss Diet) క్యారెట్ తినడం, వాటి జ్యూస్ తాగడం చేస్తుంటారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..