Zamana Movie: యూత్‌ ఫుల్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా జ‌మాన మూవీ..టైటిల్ ప్రోమో విడుద‌ల చేసిన వెంకీ కుడుముల..

Zamana Movie: యూత్‌ ఫుల్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌ జ‌మాన మూవీ టైటిల్ ప్రోమోను ప్రముఖ డైరెక్టర్‌ వెంకీ కుడుముల విడుదల చేశారు. ఈ సినిమా యూత్‌కు చాలా బాగా నచ్చుతుందన్నారు. చార్మినర్‌ దగ్గర ఉండే షాట్స్‌ చాలా బాగున్నాయన్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2023, 04:54 PM IST
 Zamana Movie: యూత్‌ ఫుల్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా జ‌మాన మూవీ..టైటిల్ ప్రోమో విడుద‌ల చేసిన వెంకీ కుడుముల..

Zamana Movie: ప్రస్తుతం చిన్న హీరో, పెద్ద హీరో అని తేడాల్లేకుండా కంటెంట్‌, స్టోరీ ఉన్న ప్రతి సినిమా హిట్‌ అవుతోంది. స్టోరీ స్ట్రాంగ్‌ ఉన్న ప్రతి మూవీకి ప్రేక్షకులు విజయాలను కట్టబెడుతున్న సంగతి అందిరికీ తెలిసిందే..ఇలాంటి కొవలోనే ఆధునిక జీవనశైలి అనుసరించే యువత ఆలోచనలకు అద్దం పట్టే మంచి కంటెంట్‌తో నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ `జ‌మాన‌`..ఈ మూవీలో బో సినిమా ద్వారా మంచి పేరు సంపాదించుకున్న సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ శ్రీ ల‌క్ష్మీ వ‌ల్ల‌భ క్రియేష‌న్స్, విఎస్ అసోసియేట్స్ ప‌తాకాల‌పై బొద్దుల లక్ష్మణ్‌తో పాటు తేజస్వి అడప కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్‌ భాస్క‌ర్ జ‌క్కుల ప్రేక్షకులకు అందించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ప్రోమోను ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల లాంచ్‌ చేశారు. 

జ‌మాన మూవీపై వెంకీ కుడుముల మాట్లాడుతూ.."జమాన టైటిల్‌ ప్రోమో ఇటీవలే చూశాను. చాలా ఆసక్తిగా ఉంది. ఈ చిత్రంలో తమదైన శైలిలో పాత్ర పోషించిన సూర్య శ్రీ‌నివాస్, సంజ‌య్‌కి ఆల్ ది బెస్ట్‌..ఈ కథకు ప్రాణం పోసిన  జ‌క్కుల విజ‌న్ చాలా బాగా నచ్చింది. ఈ టైటిల్‌ ప్రోమోలో చార్మినర్‌ వద్ద ఉండే షాట్‌ చాలా బాగుంది. ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి సహాయ, సహాకారాలైనా మా టీమ్‌ ఎప్పుడు ముందుంటుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రతి ఒక్కారికి ఆల్ ది వెరీ బెస్ట్" అన్నారు. 

ఈ సినిమాపై హీరో సూర్య శ్రీ‌నివాస్ మాట్లాడుతూ.."మేము అడగగానే వెంటనే స్పందించి మా కోసం వచ్చి..మా సినిమా టైటిల్ ప్రోమోను విడుదల చేసిన డైరెక్టర్‌ వెంకీ గారికి థ్యాంక్స్‌ సో మచ్‌..వెంకీ సార్‌ది చాలా లక్కీ హాండ్‌..ఆయన చేతుల మీదుగా లాంచైన జ‌మాన సినిమా కూడా సక్సెస్‌ అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. మా డైరెక్టర్‌కి కూడా మంచి విజన్‌ ఉంది. ఈ తరం యువతకు కనెక్ట్‌ అయ్యే సీన్స్‌ ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకి థ్యాంక్స్‌" అని అన్నారు.

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

జ‌మాన సినిమాపై డైరెక్టర్‌ భాస్క‌ర్ జ‌క్కుల మాట్లాడుతూ.."ముందుకు జ‌మాన టైటిల్ ప్రోమో విడుదల చేసిన వెంకీ కుడుములకి థ్యాంక్స్‌..చార్మినార్‌, ఓల్డ్‌ సిటీ బ్యాక్‌ డ్రాప్‌లో ఉండే యూత్‌కి నచ్చే లాగా జమాన సినిమాను రూపొందించాము..ఈ సినిమాకు యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్ ఎంతో సపోర్ట్ చేశారు. ముఖ్యంగా కథని నమ్మి ప్రొడ్యూస్ చేసిన నిర్మాతలకి ధన్యవాదాలు..అతి త్వరలోనే మ‌రో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌తో మీ ముందుకు వస్తాం" అని అన్నారు. 

ఈ సినిమాలో సూర్య శ్రీ‌నివాస్‌, సంజీవ్ కుమార్, స్వాతి క‌ష్య‌ప్‌, జారా త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటించగా..తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్ ఈ సినిమాకు నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ జ‌మాన సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ కేశ‌వ కిర‌ణ్‌ సంగీతం అందిస్తున్నారు. ఎంఆర్ వ‌ర్మ‌ ఎడిటర్‌గా..స‌తీష్ రెడ్డి అల్లం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్యవహరిస్తున్నారు. 

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News