ఎన్టీఆర్‌ బయోపిక్‌లో భారీ తార‌గ‌ణం..!

అన్న స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా తేజ ద‌ర్శక‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం ఎన్టీఆర్.

Last Updated : Apr 11, 2018, 01:46 PM IST
ఎన్టీఆర్‌ బయోపిక్‌లో భారీ తార‌గ‌ణం..!

అన్న స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా తేజ ద‌ర్శక‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం ఎన్టీఆర్. ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్రలో బాల‌కృష్ణ న‌టించ‌నున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌లే ఈ మూవీ పూజా కార్యక్రమాల‌ను ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు చేతులు మీదుగా నిర్వహించారు. ఇక ఈ మూవీలో భారీ తార‌గ‌ణం ఉండే అవ‌కాశం కనిపిస్తోంది.

తాజాగా ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర కోసం మహేష్ ని నటించమని బాలకృష్ణ అడిగారట. దీనికి మహేష్ సంతోషంగా అంగీకరించాడని స‌మాచారం. ఇక జ‌య‌ల‌లిత పాత్ర కోసం కాజ‌ల్ ను సంప్రదిస్తే ఆమె ఓకే చెప్పింద‌ని టాక్. అలానే శ్రీదేవి పాత్రకు దీపికా పదుకొణేను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇంకా ఈ సినిమాలో పెద్ద స్టార్‌ హీరోలను తీసుకునే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే హరికృష్ణ పాత్రలో నందమూరి కల్యాణ్‌రామ్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. నారా రోహిత్‌, తారక రత్నలు కూడా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాలయ్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కాబట్టి సినిమాలో వివాదాలకు సంబంధించిన అంశాలు ఉండకపోవచ్చు.

మీరు 'ఎన్టీఆర్ బయోపిక్' సినిమాలో నటించబోతున్నారా..? అని పాత్రికేయులు తారక్ ను ప్రశ్నించగా.. ''ఎన్టీఆర్ బయోపిక్‌కి సంబంధించి నాకు ఎటువంటి పిలుపు రాలేదు. ఒకవేళ అక్కడి నుంచి పిలుపు వస్తే మాత్రం తప్పకుండా తాతగారి బయోపిక్‌లో నటిస్తాను'' అంటూ తెలిపారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడి పాత్రలో ప్రముక నటుడు రాజశేఖర్ కనిపించబోతున్నారట. ఇలా చాలా మంది స్టార్లు ఎన్టీఆర్ బయోపిక్‌లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది.

సినిమాలోని పాత్రలకు సంబంధించి చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది. వారే స్వయంగా ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ సినిమా ప్రమోషన్లు నిర్వహిస్తారని టాక్. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే దసరాకు రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం అని తేజ తెలిపారు.

Trending News