మరో విశ్వరూపం చూపించనున్న లోకనాయకుడు

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ స్వీయ దర్శకత్వంలో, నిర్మాణంలో వచ్చి ఘనవిజయం సాధించిన చిత్రం ‘విశ్వరూపం’. 

Last Updated : Jul 30, 2018, 04:46 PM IST
మరో విశ్వరూపం చూపించనున్న లోకనాయకుడు

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ స్వీయ దర్శకత్వంలో, నిర్మాణంలో వచ్చి ఘనవిజయం సాధించిన చిత్రం ‘విశ్వరూపం’.  దీనికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం 'విశ్వరూపం 2'.  తాజాగా మూవీ యూనిట్ మరో ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో కమల్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారు. ముఖ్యంగా టెర్రరిస్ట్ లుక్‌లో, గూడఛారి పాత్రలో కనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు. పూర్తిగా తీవ్రవాదం నేపథ్యంలో సాగే స్టోరీని అద్భుతంగా తెరకెక్కించానని ఇటీవలే కమల్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. విశ్వరూపం 2 ట్రైలర్‌ను మీరూ చూడండి (తమిళంలో..)

గిబ్రాన్‌ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఆస్కార్ ఫిల్మ్ (ప్రై) లిమిటెడ్ బ్యానర్‌పై తెరకెక్కుతుంది. కమల హాసన్ స్వయంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ భారీ చిత్రంపై ప్రేక్షకుల్లో చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఈ యాక్షన్ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పూజా కుమార్, ఆండ్రియా ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటిస్తుండగా రాహుల్ బోస్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయనున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: షను వర్గీస్‌, శామ్‌దత్‌ షైనుదీన్‌, ఎడిటింగ్‌: మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, నిర్మాతలు: చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌, వి. రవిచంద్రన్, రచన, దర్శకత్వం: కమల్‌హాసన్‌.

Trending News