చెన్నై: తమిళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తు ఇరు బాషల ఆడియెన్స్ కి సుపరిచితుడైన సినీనటుడు విశాల్‌ని చెన్నైలో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళ చిత్ర నిర్మాతల మండలి కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించే క్రమంలో చెన్నై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా వున్న విశాల్ పలు నేరాల్లో పాల్పంచుకున్నాడని, అతడు తక్షణమే ఆ పదివికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 300 మంది నిర్మాతల సమూహం తాజాగా చిత్ర నిర్మాతల మండలి కార్యాలయానికి తాళం వేసింది. దీనిని వ్యతిరేకిస్తూ విశాల్ చిత్ర నిర్మాతల మండలి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించే క్రమంలోనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్టు సమాచారం.