అరుదైన ఈ గంగా డాల్ఫిన్ .. అందరినీ అబ్బురపరుస్తోంది.. వీడియో వైరల్..

సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారం అవుతోన్న ఓ వీడియో అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ సమీపంలో అంతుచిక్కని గంగా నది డాల్ఫిన్ గంగా, బ్రహ్మపుత్ర నదులలో భారత్, బంగ్లాదేశ్, నేపాల్లోని

Last Updated : Apr 28, 2020, 12:38 AM IST
అరుదైన ఈ గంగా డాల్ఫిన్ .. అందరినీ అబ్బురపరుస్తోంది.. వీడియో వైరల్..

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారం అవుతోన్న ఓ వీడియో అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ సమీపంలో అంతుచిక్కని గంగా నది డాల్ఫిన్ గంగా, బ్రహ్మపుత్ర నదులలో భారత్, బంగ్లాదేశ్, నేపాల్లోని వాటి ఉపనదులలో కనిపించే మంచినీటి డాల్ఫిన్. భారతదేశ జాతీయ జల జంతువుగా గుర్తించబడిన డాల్ఫిన్ ఇప్పుడు అంతరించిపోతున్న జాతిగా పరిగణించబడుతోన్నతరుణంలో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ప్రత్యక్షమవ్వడం వన్యప్రాణుల ప్రేమికులందరినీ ఎంతగానో అబ్బురపరుస్తోంది. 

కాగా మీరట్ లోని గంగా నదిలో ఈ డాల్ఫిన్లను గుర్తించడం తన అదృష్టమని భారత అటవీ శాఖ అధికారి ఆకాష్ దీప్ బాధవన్ అన్నారు. గంగా నది డాల్ఫిన్, ఒకప్పుడు గంగా-బ్రహ్మపుత్ర-మేఘనా నది వ్యవస్థలో నివసించిన జాతీయ జల జంతువు ఇప్పుడు అంతరించిపోతోందంటూ వీడియోను పంచుకుంటూ బాధవన్ ట్వీట్ చేశారు. ఈ వీడియో ఉదయం నుండి ఇప్పటికే 10,000 వీక్షణలు సంపాదించింది. చేపల సమృద్ధిగా, నీటి ప్రవాహాలు నెమ్మదిగా ఉన్న ప్రదేశాలలో మంచినీటి డాల్ఫిన్లు కాబడుతుంటాయని బాధవన్ పేర్కొన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News