కోటికిపైగా వ్యూస్‌తో దూసుకుపోతున్న వినయ విధేయ రామ ట్రైలర్

కోటికిపైగా వ్యూస్‌తో 11 మిలియన్స్ మార్క్ టచ్ చేసిన వినయ విధేయ రామ ట్రైలర్

Last Updated : Dec 31, 2018, 02:08 PM IST
కోటికిపైగా వ్యూస్‌తో దూసుకుపోతున్న వినయ విధేయ రామ ట్రైలర్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన వినయ విధేయ రామ మూవీ అభిమానులకు సంక్రాంతి కానుకగా జనవరి 11న థియేటర్లలోకొచ్చేందుకు రెడీ అవుతోంది. విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో డిసెంబర్ 27న విడుదలైన వినయ విధేయ రామ ట్రైలర్‌కి అభిమానుల నుంచి భారీ స్పందన కనిపించింది. లిడుదలైన మొదటి మూడు రోజుల్లోనే కోటికిపైగా వ్యూస్‌ సాధించడమే కాకుండా 11 మిలియన్స్ మార్క్ టచ్ చేసిన వినయ విధేయ రామ ట్రైలర్.. సినిమాపై వున్న భారీ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్ సీన్స్, మెగా పవర్ స్టార్ జోష్ ఈ ట్రైలర్ విజువల్స్‌లో స్పష్టంగా కనిపించింది. దీనికితోడు దేవీశ్రీ ప్రసాద్ కంపోజిషన్‌లో రూపొందిన తస్సాదియ్య పాట సైతం మాస్ బీట్స్‌తో ఆకర్షిస్తోంది. దీంతో 'రంగస్థలం' తర్వాత చెర్రీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం అని అభిమానులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Trending News