వినయ విధేయ రామ మూవీ మాస్ హిట్ ప్రోమో

స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో వినయ విధేయ రామ మూవీ ప్రస్తుతానికి సక్సెస్‌ఫుల్‌గానే దూసుకుపోతుంది.

Last Updated : Jan 13, 2019, 08:36 PM IST
వినయ విధేయ రామ మూవీ మాస్ హిట్ ప్రోమో

సంచలన చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన వినయ విధేయ రామ మూవీ రివ్యూలకి మిశ్రమ స్పందన కనిపించింది. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు లాంటి పాత్ర పోషించిన రామ్ చరణ్ లాంటి ప్రతిభగల నటుడికి తగిన సినిమా కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బోయపాటి డైరెక్షన్ సినిమా ఫలితంపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. అయితే, ఇలాంటి అభిప్రాయాలు ఏవీ వినయ విధేయ రామ కలెక్షన్స్‌పై ప్రభావం చూపలేకపోయాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో వినయ విధేయ రామ మూవీ ప్రస్తుతానికి సక్సెస్‌ఫుల్‌గానే దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు మరింత బూస్టింగ్ అవసరం అని భావించిన మేకర్స్ తాజాగా వినయ విధేయ రామ మూవీ మాస్ హిట్ ప్రోమోను విడుదల చేశారు.

Trending News