Ananya Panday: ఆసక్తికరమైన విషయాలు చెప్పిన అనన్య పాండే!

విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఫైటర్ మూవీలో నటిస్తోంది అనన్య పాండే (Ananya Panday). తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోందని.. తన కెరీర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని చెబుతోంది ఈ అమ్మడు.

Last Updated : Nov 28, 2020, 03:25 PM IST
Ananya Panday: ఆసక్తికరమైన విషయాలు చెప్పిన అనన్య పాండే!

బ్యాక్‌గ్రౌండ్‌తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల భామ అనన్య పాండే. అయినా తన నటన, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సీక్వెల్‌ ద్వారా హిందీ వెండితెరపై తళుక్కున మెరిసింది. టీనేజ్‌లోనే సినిమాలకు రావడంతో ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగుతున్న ఈ బ్యూటీ తెలుగు సినిమాలకు త్వరలో పరిచయం కానుంది. 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఫైటర్ మూవీలో నటిస్తోంది అనన్య పాండే. తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోందని.. తన కెరీర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని చెబుతోంది ఈ అమ్మడు. ఇప్పటివరకూ కొన్ని సినిమాల్లోనే నటించానని, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెబుతోంది. పూరీ, విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమా తనకు ఓ కొత్త ప్రపంచం అని అంటోంది. 

తనపై తెలుగు ప్రేక్షకులు అభిమానాన్ని చూపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపింది. దీపికా పదుకొనే నటిస్తోన్న మరో సినిమాలో నటిస్తున్నానని, అందులో భాగమైనందుకు తనకు చాలా సంతోషంగా ఉందని అనన్య చెబుతోంది. కాగా, ఫైటర్ మూవీ టైటిల్ ఇంకా ఖరారు అవకముందే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తొలి సినిమాకు ముందే టాలీవుడ్‌లో తనకు కొత్తగా ఫ్యాన్స్ బేస్ ఏర్పడుతుందని హర్షం వ్యక్తం చేసింది. 
Also Read : Bigg Boss Telugu 4: బెస్ట్ కెప్టెన్ హారిక.. వరస్ట్ ఎవరో తేల్చేందుకు రచ్చరచ్చ!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News