Liger: అనన్య పెదాలు పిండేస్తున్న విజయ్.. పూరీ మార్క్ పోస్టర్ తో అప్డేట్!

Liger Movie First Single: విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న లైగర్ ప్రమోషన్స్ ప్రారంభించింది సినిమా యూనిట్. సినిమా నుంచి ఒక పాట విడుదల చేస్తున్నామంటూ ఒక పోస్టర్ విడుదల చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 7, 2022, 09:59 AM IST
  • లైగర్ నుంచి ఆసక్తికరమైన పోస్టర్
  • ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ప్రకటన
  • విజయ్ దేవరకొండ పోస్టర్ పై కామెంట్స్
 Liger: అనన్య పెదాలు పిండేస్తున్న విజయ్.. పూరీ మార్క్ పోస్టర్ తో అప్డేట్!

Liger Movie First Single: వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే మొట్టమొదటి ప్లాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు లైగర్ అనే పేరు ఫిక్స్ చేశారు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా పూరీ కనెక్ట్స్ బ్యానర్ మీద ఛార్మి కౌర్,  ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కరణ్ జోహార్,  అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎంఎంఏ అనే ఒక బాక్సింగ్ ఛాంపియన్షిప్ కోసం విజయ్ దేవరకొండ పోరాడబోతున్నాడు.
 
ముంబై వీధుల్లో పుట్టిన ఒక సాధారణ వ్యక్తి అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్గా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఆగస్టులో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించింది సినిమా యూనిట్. అందులో భాగంగానే సినిమా నుంచి ఒక పాట విడుదల చేస్తున్నామంటూ ఒక పోస్టర్ విడుదల చేశారు. మూవీ నుంచి మాస్ మ్యూజిక్ తో ఫస్ట్ సింగిల్ AKDI PAKDI అనే టైటిల్ తో జూలై 11న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే జూలై 8న  సాంగ్ ప్రొమోను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
 
ఇక ఈ పోస్టర్లో అనన్య పాండే పెదాలు పట్టుకుని ఆమె చేత విజిల్ వేయించేందుకు విజయ్ దేవరకొండ ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. అయితే అభిమానులు మాత్రం విజయ్ దేవరకొండ పూరి మార్క్ హీరోలా కనిపిస్తూ ఆమె పెదాలు పిండేస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకుండానే వీరిద్దరి కాంబినేషన్ లో జనగణమన అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించడమే గాక సినిమా లాంఛనంగా ప్రారంభించి అందరిలోనూ ఆసక్తి రేకెత్తించారు. ఈ సినిమాని కూడా పూరి కనెక్ట్స్ మీద పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లికి చెందిన నిర్మాణ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామి అయింది. ఇలా రెండు సినిమాల తర్వాత మూడో సినిమా కూడా పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కానీ ఆ విషయం మీద ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.
Also Read: Deepika Padukone Fan: 'ఐ లవ్ యూ' చెప్పిన ఫ్యాన్.. దీపికా పడుకోణె షాకింగ్ రిప్లై!

Also Read: The Warriorr Pre Release Event: 'రామ్' సినిమా కోసం 28 మంది అతిథులు.. జాబితా ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు,     వినోదం,     రాజకీయాలు,     విద్య,     ఉద్యోగాలు,     హెల్త్,     లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook
 

Trending News