Bogari Laxmi Narayana: టాలీవుడ్‌లో విషాదం.. కరోనాతో నిర్మాత కన్నుమూత

96 ఏళ్లలో తొలిసారి స్వర్ణం నెగ్గిన భారత్

Last Updated : Aug 31, 2020, 10:06 AM IST
  • టాలీవుడ్‌లో విషాదం.. కరోనాతో నిర్మాత కన్నుమూత
  • ఎదురీత సినిమా నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ మృతి
  • గత కొంతకాలం నుంచి కరోనాకు నిర్మాత చికిత్స
  • పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచిన నిర్మాత
Bogari Laxmi Narayana: టాలీవుడ్‌లో విషాదం.. కరోనాతో నిర్మాత కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. కరోనా బారిన పడిన నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ ఆదివారం మృతి (Bogari Laxmi Narayana Passed Away) చెందారు. కొన్నిరోజుల కిందట లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టులు చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా తేలింది. దీంతో సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆగస్టు 30న సాయంత్రం లక్ష్మీనారాయణ కన్నుమూశారని (Bogari Laxmi Narayana Dies Due To COVID19) వైద్యులు వెల్లడించారు.  FIDE Chess Olympiad: 96 ఏళ్లలో తొలిసారి స్వర్ణం నెగ్గిన భారత్

కరోనాతో నిర్మాత చనిపోయారన్న వార్త తెలియగానే తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. విలన్ రోల్స్ పోషించే శ్రవణ్ రాఘవేంద్రను హీరోగా పరిచయం చేస్తూ గతేడాది ఎదురీత అనే సినిమాను నిర్మించారు లక్ష్మీనారయణ. తన జీవితంలో ఎప్పుడూ ఎదురితే ఎదుర్కొన్నానని, నిర్మాత అయిన తర్వాత పరిస్థితి అదేనంటూ ఎదురీత సినిమా టైటిల్‌కు తనకు ఉన్న సంబంధాన్ని ఆయన వివరించిన మాటల్ని పరిశ్రమ మరోసారి గుర్తు చేసుకుంది. నిర్మాత కుటుంబసభ్యులకు టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు. Vijay Deverakonda: ‘డియర్ కామ్రేడ్’ సినిమా సరికొత్త రికార్డు

గత నెలలో నిర్మాత పోకూరి రామారావు కరోనా మహమ్మారి బారిన పడి కన్నుయూయడం ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టింది. కొన్ని రోజుల కింద కరోనా సోకిన తన తండ్రిని హైదరాబాద్ తరలిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సహ నిర్మాత, ఆయన తండ్రి దుర్మరణం చెందారు. తాజాగా మరో నిర్మాత కరోనా మహమ్మారికి బలైపోయారు. Meera Mitun Hot Stills: నటి మీరా మిథున్ ఫొటోలు ట్రెండింగ్ 
Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి

Trending News