Tata Car Sales 2022: హ్యుందాయ్, మారుతిని కొట్టేసి.. గేమ్ గెలిచేసిన టాటా!

Tata Motors 2022 Sales Growth more than Maruti and Hyundai. 2022 అమ్మకాలో మారుతి సుజుకి నంబర్ వన్ స్థానంలో ఉంది. వార్షిక ప్రాతిపదికన అమ్మకాల పెరుగుదల గణాంకాలలో మాత్రం సీన్ రివర్స్ అయింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 21, 2023, 12:45 PM IST
  • హ్యుందాయ్, మారుతిని కొట్టేసి
  • గేమ్ గెలిచేసిన టాటా
  • ఏడాది ప్రాతిపదికన 59 శాతం
Tata Car Sales 2022: హ్యుందాయ్, మారుతిని కొట్టేసి.. గేమ్ గెలిచేసిన టాటా!

Tata Motors beat Maruti Suzuki and Hyundai in 2022 Sales Growth: 2022 సంవత్సరంలో మారుతి సుజుకి కంపెనీ 15,76,025 వాహనాలను విక్రయించింది. దాంతో భారత దేశంలో 2022లో అత్యధికంగా కార్లను విక్రయించిన సంస్థలలో ఒకటిగా నిలిచింది. దేశంలో ప్రతి సంవత్సరం అత్యధిక కార్లను విక్రయించే కంపెనీగా మారుతీ సుజుకి చాలా కాలంగా నిలుస్తూ వస్తోంది. 2022 సంవత్సరం క్యాలెండర్‌లో మారుతి సుజుకి 5,52,511 వాహనాలను విక్రయించింది. మారుతి సుజుకి తర్వాత హ్యుందాయ్ రెండవ స్థానంలో ఉంది. టాటా మోటార్స్ మూడవ స్థానంలో ఉంది. టాటా 2022లో మొత్తంగా 5,26,798 కార్లను విక్రయించింది.

2022 అమ్మకాల (Tata Car Sales 2022) గురించి మాట్లాడినట్లయితే.. మారుతి సుజుకి నంబర్ వన్ స్థానంలో ఉంది. హ్యుందాయ్ నంబర్ టూలో ఉండగా.. టాటా మోటార్స్ మూడవ స్థానంలో నిలిచింది. అయితే వార్షిక ప్రాతిపదికన అమ్మకాల పెరుగుదల గణాంకాలు చూస్తే మాత్రం.. సీన్ రివర్స్ అయింది. టాటా మోటార్స్ విక్రయాల్లో అత్యధిక వృద్ధిని సాధించింది. వృద్ధి పరంగా మారుతీ సుజుకి మరియు హ్యుందాయ్ రెండింటినీ టాటా మోటార్స్ వెనుకకు నెట్టింది.

టాటా మోటార్స్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 59 శాతం పెరగగా.. మారుతీ సుజుకీ అమ్మకాలు 15 శాతం పెరిగాయి. ఇక హ్యుందాయ్ విక్రయాలు 9 శాతం మాత్రమే పెరిగాయి. 2021 క్యాలెండర్ సంవత్సరంలో టాటా మోటార్స్ 3,31,178 కార్లను విక్రయించగా.. 2022లో అమ్మకాలు 59 శాతం పెరిగి 5,26,798కి చేరుకున్నాయి.

మారుతి సుజుకి 2021 క్యాలెండర్ సంవత్సరంలో 13,64,791 కార్లను విక్రయించింది. 2022లో 15 శాతం పెరిగి..15,76,025కి చేరుకుంది. అదే సమయంలో హ్యుందాయ్ 2021లో 5,05,533 కార్లను విక్రయించింది. 2022 అమ్మకాలు 9 శాతం పెరిగి 5,52,511 యూనిట్లకు చేరుకుంది. ఈ లెక్కలు చూస్తే.. 59 శాతంతో టాటా మోటార్స్ గేమ్ గెలిచిందని చెప్పొచ్చు. 

Also Read: IND vs NZ: విజయం ఉత్సాహంలో ఉన్న భారత్‌కు బిగ్‌ షాక్‌.. భారీ జరిమానా! తప్పిదాన్ని అంగీకరించిన రోహిత్  

Also Read: Upcoming Electric Scooters: చౌక ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేస్తున్నాయి.. ధర రూ.70 వేలు మాత్రమే! పండగే పండగ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News