Rhea Chakraborty, Mahesh Bhatt: వైరల్‌గా మారిన రియా చక్రవర్తి, మహేష్ భట్ మధ్య వాట్సాప్ చాటింగ్‌

రియా చక్రవర్తికి, ప్రముఖ బాలీవుడ్ ఫిలింమేకర్ మహేష్ భట్‌కి (Rhea Chakraborty, Mahesh Bhatt whatsapp chat ) మధ్య జూన్ 8న జరిగిన వాట్సాప్ చాటింగ్ బయటికి లీక్ అవడమే కాకుండా అది వైరల్‌గానూ మారింది.

Last Updated : Aug 21, 2020, 05:56 PM IST
Rhea Chakraborty, Mahesh Bhatt: వైరల్‌గా మారిన రియా చక్రవర్తి, మహేష్ భట్ మధ్య వాట్సాప్ చాటింగ్‌

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput ) చనిపోయినప్పటి నుంచి అతడి గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) వార్తల్లోకెక్కని రోజు లేదు. రియా చక్రవర్తి కుటుంబం వేధింపుల వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ ( KK Singh ) బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం బిహార్ పోలీసులు రియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం, ఆ తర్వాత సుశాంత్ మృతి కేసు విచారణ సీబీఐకి ( CBI ) బదిలీ అవడం వంటి పరిణామాలతో రియా చక్రవర్తి పేరు మరింత మార్మోగిపోయింది. Also read : Rhea Chakraborty: సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ కాల్ డేటాలో రానా, రకుల్, అమీర్ ఖాన్ పేర్లు 

ఇదిలావుండగా తాజాగా రియా చక్రవర్తికి, ప్రముఖ బాలీవుడ్ ఫిలింమేకర్ మహేష్ భట్‌కి (Rhea Chakraborty, Mahesh Bhatt whatsapp chat ) మధ్య జూన్ 8న జరిగిన వాట్సాప్ చాటింగ్ బయటికి లీక్ అవడమే కాకుండా అది వైరల్‌గానూ మారింది. వాళ్లిద్దరి మధ్య జరిగిన చాటింగ్ వైరల్ అవడానికి కారణం ఏంటంటే... అదే రోజున తాను తన బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ని వదిలేసి వెళ్తున్నానని రియా చక్రవర్తి ఆ వాట్సాప్ చాటింగ్‌లో మహేష్ భట్‌కి తెలియజేయడమే. Also read : Surekha Vani: కనిపించిన ప్రతీ మగాడితో అఫైర్స్ అంటగడుతున్నారని నటి ఆవేదన

'' Sushant Singh Rajput తో ఉండటం ( Relationship ) నాన్నకు ఇష్టం లేదని.. అందుకే అతడి నుండి దూరంగా వెళ్తున్నాను'' అని రియా చక్రవర్తి పేర్కొనగా.. ఆమె ఛాటింగ్‌కి మహేష్ భట్ స్పందిస్తూ.. ''ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు'' అని అభినందించడం ఆ చాటింగ్‌లో చూడొచ్చు. అంతేకాకుండా నువ్వు తీసుకున్న నిర్ణయం మీ నాన్నకు కూడా సంతోషాన్నిస్తుందని చెబుతూ ఇక వెనక్కి తిరిగిచూడొద్దని మహేష్ భట్ సలహా ఇవ్వడం.. ఇరువురు ఒకరికొకరు పరస్పరం కృతజ్ఞతలు చెప్పుకోవడం వంటివి ఆ చాటింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. ఒకానొక చోట '' నువ్వు నా ఏంజెల్‌వి '' అంటూ మహేష్ భట్ రాసుకొస్తే.. '' ఐ లవ్ యూ మై మ్యాన్.. విల్ మేక్ యూ ప్రౌడ్'' అని రియా చక్రవర్తి బదులివ్వడం వంటివి ఈ చాటింగ్‌ని మరింత వైరల్ అయ్యేలా చేశాయి. Also read : Trisha: త్రిష వాటిని ఎందుకు డిలీట్ చేసింది ?

ముందు నుంచీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు ( Sushant Singh Rajput death case ) రియా చక్రవర్తి, మహేష్ భట్ లాంటి వాళ్లే కారణం అని ఆగ్రహంతో ఊగిపోతున్న సుశాంత్ అభిమానులకు ఇప్పుడీ చాటింగ్ కంటపడటం వారికి మరింత కోపాన్ని తెప్పిస్తోంది. Also read : Pushpa item song: అల్లు అర్జున్‌తో బాలీవుడ్ బ్యూటీ ఐటం సాంగ్ 

Trending News