HER Chapter 1: అమెజాన్‌ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న హెచ్‌ఈఆర్‌ చాప్టర్‌ 1.. క్రైమ్ థ్రిల్లర్ చూసేయండి గురూ..!

Ruhani Sharma HER Chapter 1 Streaming on Amazon Prime: క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రుహానీశర్మ ప్రధాన పాత్రలో శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వలో తెరకెక్కిన మూవీ హెచ్‌ఈఆర్‌ చాప్టర్‌ 1. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా.. అత్యధిక వ్యూస్‌లో టాప్‌-10లో ట్రెండింగ్‌లో ఉంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2023, 10:10 PM IST
HER Chapter 1: అమెజాన్‌ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న హెచ్‌ఈఆర్‌ చాప్టర్‌ 1.. క్రైమ్ థ్రిల్లర్ చూసేయండి గురూ..!

Ruhani Sharma HER Chapter 1 Streaming on Amazon Prime: నటి రుహానీశర్మ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో యాక్ట్ చేసిన మూవీ హెచ్‌ఈఆర్‌ చాప్టర్‌ 1. సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీకి శ్రీధర్‌ స్వరాఘవ్‌ దర్శకత్వం వహించారు. దీప సంకురాత్రి, రఘు సంకురాత్రి నిర్మించిన ఈ చిత్రం జూలైలో థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీలోకి వచ్చి ఆరు వారాలు అయినా.. ఇంకా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో మంచి వ్యూస్‌తో టాప్ 10లో ట్రెండ్ అవుతుండడంతో మూవీ టీమ్ హర్షం వ్యక్తం చేస్తోంది. 

ఏసీపీ అర్చనా ప్రసాద్‌గా రుహానీ శర్మ ప్రేక్షకులను మెప్పించింది. నగరంలో జరిగిన హత్యలకు.. తన ఫ్లాష్ బ్యాక్‌లో ప్రియుడిని పోగొట్టుకున్న కేసుకి లింక్ ఉండటం.. ఈ కేసులను విచారించే క్రమంలో అర్చన ఎలాంటి సవాళ్లు ఎదుర్కొందనే సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. సెకెండ్ పార్ట్ మీద మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా హెచ్‌ఈఆర్ చాప్టర్ 1 చిత్రానికి ఎండ్ కార్డ్ పడుతుంది. డైరెక్టర్ శ్రీధర్‌కు మేకింగ్‌కు.. రుహానీ శర్మ యాక్టింగ్‌కు ఆడియన్స్‌ నుంచి ప్రశంసలు లభించాయి. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ డిస్ట్రిబ్యూట్‌ చేయడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.

కథ విషయానికి వస్తే.. హైద‌రాబాద్ శివార్ల‌లో జంట హ‌త్య‌లు జరుగుతాయి. వీటికి వెనుక కారణాలను బయటపెట్టేందుకు ఏసీపీ అర్చ‌నా ప్ర‌సాద్‌గా రుహానీశ‌ర్మ‌ ఎంట్రీ ఇస్తుంది. ఈ కేసును విచారించే సమయంలో ఊహించని ట్విస్టులు ఎదురవుతాయి. ఆ హత్యలను ఎవరు చేశారనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఏసీపీ అర్చనా ప్రసాద్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారో తెలుసుకోవాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.     వికాశ్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, సంజయ్ స్వరూప్, బెనర్జీ ఆకట్టుకుంటాయి. పవన్ స్వరాలు అందించారు. ఎడిటింగ్ బాధ్యతలు చాణక్య నిర్వర్తించగా.. విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అమెజాన్‌లో ఇంకా ఈ సినిమా చూడనివాళ్లు ఉంటే తప్పకచూడండి. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్‌కు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News