RRR సెకండ్ హీరోయిన్ సెలక్ట్ ..ఇంతకీ ఎవరా హాలీవుడ్ భామ ?

ఆర్ఆర్ఆర్ మూవీకి సెకండ్ హీరోయిన్ వేటలో ఉన్న చిత్రయూనిట్ ఓ ప్రముఖ హాలీవుడ్ భామను ఎంపిక చేశారట.

Last Updated : Aug 21, 2019, 02:20 PM IST
RRR సెకండ్ హీరోయిన్ సెలక్ట్ ..ఇంతకీ ఎవరా హాలీవుడ్ భామ ?

రాజ్ మౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ లో అలియా భట్ తో పాటు మరో ఫారిన్ బ్యూటీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.  అయితే వ్యక్తిగత కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి విదేశీ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకుంది. ఇప్పుడా స్థానాన్ని భర్తీ చేసేందుక హీరోయిన్ వేటలో ఉన్న చిత్రయూనిట్.. మరో హాలీవుడ్ అందాల తారతో ఆ ప్లేస్ భర్తీ చేశారట.

హాలీవుడ్ కు చెందిన నటిని ఎంపిక చేసిన విషయాన్ని  ఆర్-ఆర్-ఆర్ యూనిట్ నిర్థారించినప్పటికీ.. ఆ ముద్దుగుమ్మ ఎవరనే విషయాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. ఓ మంచి అకేషన్ చూసి ఆ పేరును ఎనౌన్స్ చేయబోతున్నట్లు టాక్. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం హాలీవుడ్ నటి ఎమ్మా రాబర్ట్స్ ను ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే వీరిలో కొమరం భీమ్ పాత్ర ఓ బ్రిటిష్ యువతితో ప్రేమలో పడుతారు. ఆ పాత్ర కోసం హాలీవుడ్ నటి ఎమ్మా రాబర్ట్స్ ను సంప్రదించగా.. ఈ  ప్రాజెక్టుకు ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలిసింది..అయితే ఈ విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

 

Trending News