వంద కోట్ల మార్కు దాటిన "సంజూ"

విడుదలైన మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో వంద కోట్లు కలెక్ట్ చేసి సినీ పరిశ్రమనే ఆశ్చర్యపరిచిన చిత్రం "సంజూ". 

Last Updated : Jul 2, 2018, 11:16 PM IST
వంద కోట్ల మార్కు దాటిన "సంజూ"

విడుదలైన మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో వంద కోట్లు కలెక్ట్ చేసి సినీ పరిశ్రమనే ఆశ్చర్యపరిచిన చిత్రం "సంజూ". మూడవ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.46.71 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో నటుడు సంజయ్ దత్ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లు రూ.120.06 కోట్లు దాటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

రణ్ బీర్ కపూర్, దియామీర్జా, సునీల్ దత్, మనీషా కొయిరాలా ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రంపై రణబీర్, సంజయ్ దత్ ఇరువురి అభిమానులకు కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రం విజయం సాధించడంపై ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలి రోజే ఈ చిత్రం రూ.34 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 

రెండవ రోజు 38.25 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రస్తుతం 100 కోట్ల క్లబ్బులో స్థానం సంపాదించుకుంది. ఈ సంవత్సరం 100 కోట్ల క్లబ్బులో చేరిన ఏడవ చిత్రం ఇది. పద్మావత్, సోనూ కీ టీటూ కీ స్వీటీ, రైడ్, బాగీ 2, రాజీ, రేస్ 3 చిత్రాల తర్వాత ఈ ఘనత సాధించిన చిత్రం "సంజూ"మాత్రమే. ఇవే కాకుండా ఇప్పటి వరకూ నమోదైన బాహుబలి చిత్రం రికార్డులను కూడా ఈ చిత్రం తిరగరాసిందట. 

Trending News