నిహారిక సంచలన నిర్ణయం ?

మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక సినిమాల విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Last Updated : Jul 9, 2019, 05:28 PM IST
నిహారిక సంచలన నిర్ణయం ?

మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక సినిమాల విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ వర్గాల టాక్ ప్రకారం అమ్మడు ఇకపై నటనకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ముందుగా వెబ్ సిరీస్‌లతో నటించడం మొదలుపెట్టిన నిహారిక ఆ తర్వాత ఒక మనసు చిత్రంతో వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే, ఆ సినిమా ఆమెకు శుభారంభాన్ని ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత నిహారిక చేసిన హ్యాపి వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. దీంతో ఇక సినిమాలు మానేసి నిర్మాతగా కెరీర్ మొదలుపెడదామనుకుంటోందట నిహారిక.

ఇప్పటికే వెబ్ సిరిస్ నిర్మాణం కోసం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించిన నిహారిక.. ఇకపై అదే బ్యానర్‌పై సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటోందనేది ఫిలిం నగర్ టాక్. అంతేకాకుండా మెగా హీరోతోనే నిర్మాతగా తన తొలి చిత్రాన్ని ప్రారంభించాలనేది అమ్మడి ఆలోచనట. ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియాలంటే.. నిహారిక నుంచే ఓ అధికారిక ప్రకటన వెలువడేవరకు వేచిచూడాల్సిందే మరి.

Trending News