హైదరాబాద్: టాలీవుడ్ సినీ ప్రముఖులు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సమావేశమయ్యారు. కాగా బాలకృష్ణను ఈ సమావేశానికి ఆహ్వానించకపోవడం తప్పిదమేనని నిర్మాతల మండలి సభ్యులు వ్యక్తం చేశారు. అయితే టాలీవుడ్ పరిశ్రమ మొత్తం కలిసొస్తే తమ ప్రభుత్వం చర్చించడానికి సిద్ధమేనని మంత్రి తలసాని తెలిపారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని, వ్యక్తిగత స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ నాగబాబు వీడియో విడుదల చేశారు.
Also Read: TikTok: మళ్ళీ పుంజుకున్న టిక్ టాక్ రేటింగ్.. కారణమదేనా?
అంతేకాకుండా తాము భూములు పంచుకోవడానికి కలిశారనడం బాధాకరమని, బాలకృష్ణ తన మాటలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణ ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఇండస్ట్రీకి మీరే కింగ్ కాదని, బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి. టాలీవుడ్ కు, తెలంగాణ ప్రభుత్వానికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని నాగబాబు డిమాండ్ చేశారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Tollywood: బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలి.. వెంటనే క్షమాపణ చెప్పాలి..