Tamil director N Lingusamy was jailed for 6 months in PVP Cinema check bounce case: ఎన్ లింగుస్వామి.. ఈ పేరు తమిళ, తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తమిళ సినిమాల్లో అత్యంత విజయవంతమైన కమర్షియల్ దర్శకుల్లో లింగుసామి ఒకరు. ఆనందం, రన్, భీమా, పందెం కోడి, ఆవారా, పందెం కోడి 2 లాంటి హిట్ సినిమాలు తెరకెక్కించారు. పలు తెలుగు సినిమాలకు కూడా కథలు అందించారు.ఇటీవల తెలుగు హీరో రామ్‌తో 'ది వారియర్' సినిమాను లింగుసామి తెరకెక్కించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ తమిళ దర్శకుడుకి ఆరు నెలల జైలు శిక్ష పడింది.
ఎన్ లింగుస్వామి కేవలం దర్శకుడు మాత్రమే కాదు.. పలు సినిమాలను కూడా నిర్మించారు. తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ హౌస్‌పై పలు సినిమాలను నిర్మించారు. ఈ ప్రొడక్షన్ హౌస్‌పైనే పలు కేసులు నమోదయ్యాయి. గతంలో తెలుగు చిత్రాల నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్ నుంచి తమిళ డైరెక్టర్ లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ అప్పు తీసుకున్నారు. తమిళ హీరో కార్తి, సమంత జంటగా ఓ సినిమా తీయాలనుకున్నారు. అయితే అది సాధ్యం కాలేదు.
కార్తి, సమంత సినిమా కార్యరూపం దాల్చకపోవడంతో.. పీవీపీ సినిమాస్ నుంచి తీసుకున్న డబ్బును చెక్కు రూపంలో లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ తిరిగి చెల్లించారు. వీరు ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో.. పీవీపీ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో సోమవారం (ఆగష్టు 22) ఈ కేసు చెన్నైలోని సైదాపేట కోర్టులో విచారణకు వచ్చింది. చెక్ బౌన్స్ కేసులో లింగుస్వామి, అతని సోదరుడు సుభాష్ చంద్రబోస్‌లకు న్యాయమూర్తి ఆరు నెలల జైలు శిక్ష విధించారు. అయితే కోర్టు తీర్పుపై లింగుస్వామి, ఆయన సోదరుడు అప్పీల్‌కు వెళ్లనున్నారట.
Also Read: మగువలకు శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే
Also Read: సడెన్ సర్‌ప్రైజ్.. విజయ్ దేవరకొండకు ఎంగేజ్‌మెంట్ అయిపొయింది! పాపం రష్మిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook