కొచ్చి: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు తొలి అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంకే అర్జునన్(87) చనిపోయారు. సోమవారం ఉదయం తన ఇంట్లోనే అర్జునన్ కన్నుమూశారు. రెహమాన్‌కు కీబోర్డ్ ప్లేయర్‌గా తొలి అవకాశం ఇచ్చిన వ్యక్తి అర్జునన్ కావడం గమనార్హం. గత కొంతకాలం నుంచి వయసురీత్యా అనారోగ్య సమస్యలతో ఉన్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అర్జునన్ మరణం పట్ల సినీ సెలబ్రిటీలు సంతాపం ప్రకటించారు. విషాదం.. నిండు గర్భిణిని బలిగొన్న కరోనా మహమ్మారి
అర్జునన్ మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. కరుతపౌర్ణమి సినిమాకు సంగీతం అందించడంతో 1968లో కెరీర్ ప్రారంభించారు అర్జునన్. ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీముఖరన్ థంపి పాటలకు 50 సినిమాల్లో స్వరాలు సమకూర్చారు. 2017లో భయానకం సినిమాతో కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు అందుకున్నారు. సన్నీ లియోన్ లేటెస్ట్ బికినీ ఫొటోలు
ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాసు పాటల్ని ఎంతో అందంగా, నైపుణ్యంతో రికార్డ్ చేయడంలో అర్జునన్ దిట్ట. 2017లో అర్జునన్ పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో రెహమాన్ అమెరికాకు వెళ్లి ఈవెంట్లో పాల్గొని విజయవంతం చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos