Kalinga Movie Pre Release Event: ధృవ వాయు హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘కళింగ’. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్‌తో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ నెల 13న ఆడియన్స్ ముందుకు రానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా తరువాత ఎక్కువగా ఓటీటీకి అలవాటు పడ్డారని అన్నారు. మన తెలుగు పరిశ్రమలో ఎక్కువ ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయని.. చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని అందుకుంటున్నాయని చెప్పారు. కళింగ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే భయపెట్టించేలా ఉన్నాయని.. ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
Also Read: Dave Bautista: WWE దిగ్గజం డేవ్ బాటిస్టా షాకింగ్ లుక్స్.. 55 ఏళ్ల వయసులో 40 కేజీల బరువు తగ్గుదల
హీరో, డైరెక్టర్ ధృవ వాయు మాట్లాడుతూ.. తాను రాసిన స్టోరీకి యాకూబ్ మంచి డైలాగ్స్ రాశాని.. కెమెరామెన్ అక్షయ్ పగలూ రాత్రి అని తేడా లేకుండా పనిచేశారని మెచ్చుకున్నారు. ఎడిటర్ నరేష్ మూవీని అద్భుతంగా తీర్చిదిద్దాడని.. విశ్వ శేఖర ఆర్ఆర్తో సినిమాను మరో స్థాయిలో నిలబెట్టిందన్నారు. డైరెక్షన్ టీం సపోర్ట్ వల్లే ఈ చిత్రాన్ని ఇంత బాగా తీయగలిమన్నారు. సంజయ్ నటనను చూసి అంతా షాక్ అవుతారని అన్నారు. ఇదో డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్ అని.. సెప్టెంబర్ 13న తప్పకుండా ఈ సినిమాను చూడాలని కోరారు.
తిరువీర్ మాట్లాడుతూ.. స్టోరీ రాసి, డైరెక్టర్ చేసి.. నటించడం అంటే మామూలు విషయం కాదని ధృవ వాయును మెచ్చుకున్నారు. తామిద్దరం ఘాజి సినిమా చేసినప్పుడు చాలా మాట్లాడుకున్నామన్నారు. కళింగ టీజర్ చూసి భయపడ్డానని చెప్పారు. ప్రొడ్యూసర్ దీప్తి కొండవీటి మాట్లాడుతూ.. కళింగ మూవీ అద్భుతంగా వచ్చిందని.. సాంగ్స్, మ్యూజిక్ గురించి అందరూ మాట్లాడుకుంటారని అన్నారు. ఆర్ఆర్ మ్యాజిక్‌ను థియేటర్లో చూడాల్సిందేనన్నారు. ప్రొడ్యూసర్ పృథ్వీ యాదవ్ మాట్లాడుతూ.. కళింగ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. విష్ణు శేఖర్ ఇచ్చిన ఆర్ఆర్తో సినిమా మరోస్థాయి వెళ్లిందన్నారు. ధృవ వాయు ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అని అన్నారు. సెప్టెంబర్ 13న రాబోతోన్న తమ సినిమా ప్రతి ఒక్కరు చూసి ఆదరించాలని కోరారు.
Also Read: Malaika father Suicide: స్టార్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య.. 7వ ఫ్లోర్ నుంచి దూకి సూసైడ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.