Mega Fans Firing on Akshay Kumar: ఒకప్పుడు భారతీయ సినిమా అనే పదం వాడటానికి మన నటీనటులు కాస్త ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల సంస్కృతి పెరిగిన తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని కాకుండా ఇండియన్ మూవీస్ అలాగే ఇండియన్ హీరో అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు. మన తెలుగు సినిమా హీరోలు చేసిన సినిమాలు భారతదేశవ్యాప్తంగా విడుదల కావడమే గాక కొన్ని ప్రపంచ వ్యాప్తంగా కూడా విడుదలవుతున్నాయి. వాళ్లు చేసిన సినిమాలు మన దగ్గర ఆదరిస్తుంటే మనని అక్కడ ఆదరించరా అనే ఉద్దేశంతో కొందరు బాలీవుడ్ హీరోలు కూడా తాము చేస్తున్న సినిమాలను తెలుగు సహా దక్షిణాది భాషలలో విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
బాలీవుడ్ హీరోలు తమ తమ సినిమాల ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చి రోజుల తరబడి తిష్టవేసి మన మీడియా ద్వారా తమ సినిమాను ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా తెలుగు హీరోల ఇళ్లకు వెళ్లి వాళ్ల ద్వారా తమ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ మరింత మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా చేయడానికి ప్రయత్నించిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు మెగా అభిమానుల ఆగ్రహానికి గురైయ్యాడు. అంటే ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు కానీ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అసలు విషయం ఏమిటంటే ఇటీవల అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రక్షా బంధన్ సినిమా ట్రైలర్ ను రామ్ చరణ్ తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
అక్షయ్ సార్ ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది, అన్నా చెల్లెళ్ళ అద్భుతమైన బంధాన్ని బాగా చూపించారు అంటూ కామెంట్ చేస్తూ సినిమా కూడా బాగుంటుందని భావిస్తున్నాను అంటూ పేర్కొనడంతో దానికి రిప్లై ఇస్తూ అక్షయ్ కుమార్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. అక్షయ్ కుమార్ రామ్ చరణ్ ను అన్నా అని సంబోదించడమే దానికి కారణం అయింది. బాబాయ్ వయసున్న వ్యక్తివి మా రామ్ చరణ్ ని అన్నా అని ఎలా సంబోధిస్తావు అంటూ కొంతమంది మెగా అభిమానులు చిరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం రామ్ చరణ్ క్రేజ్ అటు నార్త్ సహా సౌత్ లో కూడా భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో అలా సంబోదించడంలో తప్పేముంది అంటూ ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో ఒక హీరో సినిమాని మరో హీరో ప్రమోట్ చేస్తున్న దాఖలాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇదేమీ తప్పు కాదని, అన్నా అనడం పెద్ద తప్పు కూడా కాదంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అన్నా అనేది గౌరవాన్ని పెంచే పదమే కానీ తగ్గించే పదం కాదు కదా, ఈ విషయంలో ఇంత ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదని కామెంట్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ చివరిగా హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా దక్షిణాది భాషలతో పాటు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించింది. ఆ తరువాత ఆచార్య సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చినా ఇప్పుడు రామ్ చరణ్ చేస్తున్న శంకర్ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జెర్సి సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గౌతం తిన్ననూరి రామ్ చరణ్ చేసే సినిమా కూడా బాలీవుడ్ సహా మిగతా అన్ని భాషల్లో కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read: Jr Ntr Phone Call: కోమాలో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ ఫోన్.. మాటవినగానే వేళ్లు కదిలాయట!
Also Read: Rekha Boj: సాయి పల్లవి, ప్రకాష్ రాజ్ నో* ఏం పెట్టుకున్నారు?.. హీరోయిన్ రేఖ వివాదాస్పద వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook