మహానటి - మూగ మనసులు లిరికల్ వీడియో

అలనాటి నటి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'.

Last Updated : Apr 24, 2018, 04:06 PM IST
మహానటి - మూగ మనసులు లిరికల్ వీడియో

అలనాటి నటి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకుడు కాగా ప్రియాంకదత్ నిర్మాత. సమంత అక్కినేని, విజయ్ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్ కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో 'మూగ మనసులు' అనే లిరికల్ గీతాన్ని  మూవీయూనిట్ శుక్రవారం రిలీజ్ చేసింది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ గీతానికి మిక్కీ జే మేయర్ ట్యూన్ అందించారు. శ్రేయాఘోషల్, అనురాగ్ కులకర్ణి ఈ గీతాన్ని పాడారు. నిర్మాత మాట్లాడుతూ, సావిత్రి సినీ, వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. జెమిని గణేషన్, సావిత్రి మధ్య ప్రేమను చాటిచెప్పే ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. ఇటీవల విడుదలైన టీజర్, కీర్తి సురేష్, సమంత, విజయ్ దేవరకొండ ఫస్ట్‌లుక్‌లకు ప్రేక్షకుల నుండి చక్కటి స్పందన లభిస్తున్నది. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానున్నది. తాజాగా విడుద‌లైన ‘మూగ మనసులు..’’ అంటూ సాగే ఈ పాటని మీరు విని ఎంజాయ్ చేయండి.

 

 

Trending News