సినీ వినీలాకాశంలో శ్రీదేవి స్థానం ఎవరూ భర్తీ చేయలేనిది. నాలుగు దశాబ్దాల పైచిలుకు సినీ ప్రస్థానంలో శ్రీదేవి వెలుగొందారు. అందం, అభినయం, నటనతో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయికగా పేరు సంపాదించుకున్నారు. వెండితెర సాక్షిగా శ్రీదేవి పొందిన పురస్కారాలు, గౌరవాలు కోకొల్లలు. చిన్నతనంలోనే పురస్కారాన్ని పొందిన ఘనత ఆమె సొంతం. శ్రీదేవికి దక్కిన పురస్కారాలు, గౌరవాలతో.. పేరు ప్రతిష్టలు మరింతగా పెరిగాయి.
పౌర పురస్కారం
2013 – భారత ప్రభుత్వం నుంచి నాల్గవ అత్యంత పౌర పురస్కారం పద్మశ్రీ దక్కింది
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
2013- మిస్టర్ ఇండియా, నాగిన చిత్రాలకు ఫిలిం ఫేర్ స్పెషల్ అవార్డు
1992 – లమ్హే చిత్రానికి ఉత్తమ నటి పురస్కారం
1990 – చాల్‌బాజ్ చిత్రానికి ఉత్తమ నటి పురస్కారం
1991 – క్షణక్షణం చిత్రానికి ఉత్తమనటి (తెలుగు) పురస్కారం
1982 – మీండుమ్ కోకిల చిత్రానికి ఉత్తమనటి (తమిళం) పురస్కారం
1977 – ఫిల్మ్‌ఫేర్ ప్రత్యేక పురస్కారం 16 వయదినిలే(తమిళం) చిత్రానికి
జీ సినిమా అవార్డులు
2018 – మామ్ చిత్రానికి జీ సినీ ఉత్తమ నటి పురస్కారం
ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టయిల్ పురస్కారాలు
2015 – అల్టిమేట్ దివా పురస్కారం
బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు
2012 – ఇంగ్లీష్ వింగ్లిష్ చిత్రానికి అత్యధికంగా వినోదపరిచిన నటి పురస్కారం
తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు
1981 – మూండ్రామ్ పిరై చిత్రానికి ఉత్తమ నటి పురస్కారం
స్టార్‌డస్ట్ పురస్కారాలు
2013 – ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రానికి ఉత్తమ నటి పురస్కారం
ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్
2013 - ఎన్డీటీవీ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్
ఇండియా టుడే ఉమెన్ సమ్మిట్ పురస్కారాలు
2013 - ఇండియా టుడే ఉమెన్ ఇన్ ఆర్ట్స్
టీఎస్ఆర్-టీవీ9 అవార్డులు
2013 - ఎంప్రెస్ ఆఫ్ ఇండియన్ సినిమా
స్టార్ వ్యూస్ ఫిల్మ్ అవార్డులు
2015 - పులి చిత్రానికి కోసం ఉత్తమ ఫిమేల్ విలన్ అవార్డు
ప్రత్యేక గౌరవాలు
1971 – ఉత్తమ బాల నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
1990 – భారతీయ సినిమాకు సేవలందించినందుకు స్మితాపాటిల్ స్మారక పురస్కారం
1997 – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళాసరస్వతి పురస్కారం
2003 – లచ్చు మహరాజ్ పురస్కారం
2003 – భారతీయ సినిమాకు సేవలందించినందుకు వంశీ అంతర్జాతీయ పురస్కారం
2003 – భారతీయ సినిమాకు సేవలందించినందుకు మామి పురస్కారం
2008 – ఫిక్కీ నుంచి లివింగ్ లెజెండ్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్ పురస్కారం
2009 – హిందీ సినిమాకు సేవలందించినందుకు 33వ కైరో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వద్ద ప్రత్యేక సత్కారం
2012 – ఇంగ్లీష్ వింగ్లీష్‌లో నటనకు 2012 సంవత్సరానికి ఐఆర్‌డిఎస్ చలనచిత్ర పురస్కారం
2013 – సినిమాకు సేవలందించినందుకు కేరళ ప్రభుత్వ సత్కారం
2013 – 100 ఏళ్ల భారతీయ సినిమాకు సేవలందించినందుకు భారత రాష్ట్రపతి నుంచి మెడలియన్ ఆఫ్ ఆనర్
2013 - జగ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రానికి ఉత్తమ నటి పురస్కారం
2014 - 2013 సంవత్సరానికి గానూ ఏఎన్ఆర్ జాతీయ అవార్డు
2014 - సత్యభామ విశ్వవిద్యాలయం నుండి ఇన్స్ పైరింగ్ ఐకాన్ అవార్డు
జీ సినీ అవార్డులు
2017 – మామ్ చిత్రానికి ఉత్తమ నటి పురస్కారం