King Cobra Viral Video: ఒకే బిలంలో 6 కింగ్ కోబ్రాలు.. ఎంత ఈజీగా పట్టాడో! మీరే చూడండి 

Viral Video, Snake Catchers caught sevaral King Cobras in Single Hole. ఒకే రంద్రంలో ఉన్న 5-6 కింగ్ కోబ్రాలను ఓ వ్యక్తి చాలా సునాయాసంగా పట్టాడు. ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి కొడుతోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 2, 2022, 03:03 PM IST
  • ఒకే రంద్రంలో 6 కింగ్ కోబ్రాలు
  • ఎంత ఈజీగా పట్టాడో
  • వీడియో చూస్తే పోసుకోవడం పక్కా
King Cobra Viral Video: ఒకే బిలంలో 6 కింగ్ కోబ్రాలు.. ఎంత ఈజీగా పట్టాడో! మీరే చూడండి 

Two Snake Catchers catching 6 King Cobras in Single Hole: ఇటీవల పాములకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.  ఎక్కువగా కొండచిలువ, నాగు పాము, కింగ్ కోబ్రా లాంటి పెద్దపెద్ద పాములకు సంబందించిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని వీడియోస్ ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. తాజాగా ఓ భయానక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఒకే రంద్రంలో ఉన్న 5-6 కింగ్ కోబ్రాలను ఓ వ్యక్తి చాలా సునాయాసంగా పట్టాడు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... తోటలో ఓ స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రా కాటుకు గురవుతాడు. చెట్ల పొదల్లో ఉన్న కింగ్ కోబ్రా అతడిని కాటేస్తుంది. దాంతో అతడు కాలు పట్టుకుని కిందపడి అరుస్తూ ఉంటాడు. ఇది గమనించిన మరో ఇద్దరు స్నేక్ క్యాచర్‌లు వెంటనే అతడి వద్దకు వస్తారు. ఆ పొదల్లో పాము ఉందని చెప్పగా.. వారు అటుగా వెళ్తారు. అక్కడ భారీ కింగ్ కోబ్రాను పట్టుకుని సంచిలో వేస్తారు. ఆ పొద కింద ఓ రంద్రంలో పాముల శబ్దం వినిపిస్తుంది. దాంతో ఇద్దరు స్నేక్ క్యాచర్‌లు మట్టిని తవ్వుతూ.. పాములను బయటికి తీసి బంధిస్తారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News