రంగస్థలంలో చరణ్ నటనను మెచ్చుకున్న ఎన్టీఆర్..!

సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే అమెరికాలో సైతం రికార్డు స్థాయి కలెక్షన్లతో  దూసుకెళ్తున్న ఈ చిత్రంలో చరణ్ నటనకు జూనియర్ ఎన్టీఆర్ సైతం ఫిదా అయిపోయారు.

Last Updated : Apr 2, 2018, 04:10 PM IST
రంగస్థలంలో చరణ్ నటనను మెచ్చుకున్న ఎన్టీఆర్..!

సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే అమెరికాలో సైతం రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రంలో చరణ్ నటనకు జూనియర్ ఎన్టీఆర్ సైతం ఫిదా అయిపోయారు. ఈ చిత్రాన్ని ఇటీవలే వీక్షించిన ఎన్టీఆర్ చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

అలాగే చరణ్ పోషించిన చిట్టిబాబు పాత్రపై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. "హ్యాట్సాఫ్ చరణ్. నీకు వస్తున్న అభినందనలకు, పొగడ్తలకు నువ్వు నిజంగానే అర్హుడివి. నా నుండి కూడా ఓ అభినందన అందుకో. నీకంటే ఆ పాత్రలో ఇంకెవరూ అంత బాగా చేయలేరు" అని రెస్పెక్ట్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు ఎన్టీఆర్. అలాగే సుకుమార్ దర్శకత్వ ప్రతిభను కూడా ఎన్టీఆర్ మెచ్చుకున్నారు. అద్భుతమైన డైరెక్షన్ అని కితాబిచ్చారు. ఇలాంటి భావోద్వేగ చిత్రాన్ని తెరకెక్కించాలంటే ఎంతో ధైర్యం కావాలని ట్వీట్ చేశారు

Trending News