కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 34,007 మంది మృతిచెందగా, మరో 7,24,278 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో లక్షన్నర మంది కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే విషయం. కరోనా బారిన పడి ఓ కమెడియన్ చనిపోయారు. కోవిడ్19 పాజిటీవ్‌గా తేలగా చికిత్స పొందుతూనే కరోనా కాటుకు బలయ్యారు. దీంతో సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. కరోనా ఎఫెక్ట్: హీరో నితిన్ పెళ్లి వాయిదా
జపాన్‌కు చెందిన కెన్ షిమురా (70) ప్రముఖ హాస్య నటుడు. ఆయనకు 2016లో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడి చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో కెన్ షిమురాకు ప్రాణాంతక వైరస్ సోకింది. మార్చి 19న ఆసుపత్రిలో చేరిన ఆయనకు పరీక్షలు నిర్వహించగా పాజిటీవ్‌గా తేలింది. గత పదిరోజులుగా ప్రాణాంతక మహమ్మారితో పోరాటం సాగించిన ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో కరోనా వైరస్ సోకడంతో చనిపోయిన జపాన్ తొలి సెలబ్రిటీ కెన్ షిమురా కావడం గమనార్హం. కరోనా ఎఫెక్ట్: వాట్సాప్ వినియోగదారులకు షాక్
గత ఐదు దశాబ్దాలుగా తెరమీద విశేష సేవలందించిన హాస్య నటుడి మరణం అభిమానులను షాక్‌కు గురిచేసింది. కెన్ షిమురా మరణం పట్ల జపాన్ సెలబ్రిటీలు సంతాపం ప్రకటించారు. కెన్ షిమురా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకు జపాన్‌లో కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 55కు చేరింది. అదేరోజు 68 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ