ఎన్టీఆర్ చేతికి మళ్లీ ఏమైంది ?

ఎన్టీఆర్ చేతికి మళ్లీ ఏమైంది ? 

Last Updated : May 5, 2019, 06:55 PM IST
ఎన్టీఆర్ చేతికి మళ్లీ ఏమైంది ?

ఎన్టీఆర్ చేతికి ఏమైంది ? ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోన్న ప్రశ్న ఇదే. గతంలోనే ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‌లో ఉండగా ఎన్టీఆర్ చేతి మణికట్టుకు గాయమైన సంగతి తెలిసిందే. అప్పట్లోనే అసలు ఎన్టీఆర్‌కు ఏమైందా అని తారక్ ఫ్యాన్స్ చాలా కంగారుపడ్డారు. అది అలా ఉండగానే మరోసారి ఎన్టీఆర్ మణికట్టుకు కట్టు కనిపిస్తుండటం మరోసారి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. 

8 ఏళ్ల క్రితం లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న తారక్ తాజాగా తమ పెళ్లి రోజును పురస్కరించుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేసుకున్నారు. 8 వసంతాలు పూర్తయ్యాయని, ఇంకెన్నో ఏళ్లు ఇలాగే హాయిగా కొనసాగాలని కోరుకుంటున్నాను అని చెబుతూ పోస్ట్ చేసిన ఆ ఫోటోలో ఎన్టీఆర్ మణికట్టుకి పట్టీ కనిపించడమే అభిమానుల ఆందోళనకు కారణమైంది. దీంతో ఎన్టీఆర్‌కి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూనే చేతికి ఏమైందని ఆరా తీయడం మొదలుపెట్టారు ఆయన అభిమానులు.

ఇక రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ విషయానికొస్తే, గతంలో రాంచరణ్ కాలికి గాయం కారణంగా ఓసారి, ఎన్టీఆర్ చేతికి గాయం కారణంగా మరోసారి షూటింగుకి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇదిలావుండగా ఇప్పుడు మళ్లీ తారక్ మణికట్టుకు పట్టీతో కనిపించడం చూస్తోంటే, ఆర్ఆర్ఆర్ సినిమా అనుకున్న సమయానికి విడుదల అవడం కష్టమేననే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Trending News