మా ఆయన యోధుడు.. ప్రతీ అడ్డంకిని దాటుతారు: ఇర్ఫాన్ భార్య సుతాపా సిక్‌దర్

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కొన్ని రోజులుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

Last Updated : Mar 10, 2018, 08:51 PM IST
మా ఆయన యోధుడు.. ప్రతీ అడ్డంకిని దాటుతారు: ఇర్ఫాన్ భార్య సుతాపా సిక్‌దర్

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కొన్ని రోజులుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇటీవల స్పందించిన ఇర్ఫాన్ ఖాన్‌, తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే స్వయంగా వెల్లడిస్తానని చెప్పారు.పుకార్లను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తాజాగా ఈ విషయంపై ఇర్ఫాన్ భార్య సుతాపా సిక్‌దర్ స్పందించారు.  ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితిని భావోద్వేగంగా అభిమానులతో పంచుకున్నారు.

‘నా స్నేహితుడు, నా జీవిత  భాగస్వామి ఓ యోధుడు. ఆయన ప్రతీ అడ్డంకిని అద్భుతమైన ప్రతిభతో అందంగా దాటుతున్నారు. కొద్ది రోజులుగా ఫోన్‌ కాల్స్‌కు, మెసేజ్‌లకు స్పందించనందుకు అందరూ  క్షమించాలి. ఇర్ఫాన్ ఆరోగ్యం కుదుటపడాలంటూ దేవుడికి ప్రార్థనలు చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. ప్రస్తుతం నేను గెలుపు కోసం యుద్ధభూమిలో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టాను. అది అంత సులభం కాదని నాకు తెలుసు. ఇర్ఫాన్ అభిమానులు కూడా ఇదే రీతిలో తమ జీవిత పోరాటంలో గెలిచేలా ప్రయత్నించాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని సుతాపా సిక్‌దర్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. కాగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యంపై స్పందించారు.  

ఇర్ఫాన్‌ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న బ్లాక్ మెయిల్‌, పజిల్‌, కర్వాన్‌, రైతా చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. 'బ్లాక్‌మెయిల్' చిత్రం ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Trending News