ముంబై: ముంబయిని ఉగ్రవాద దాడుల నుండి రక్షించే బాధ్యతను తీసుకునే ఎటిఎస్ అధికారిగా ప్రధాన పాత్రలో నటిస్తున్నఅక్షయ్ కుమార్, వీర్ సూర్యవంశి అనే చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రానికి కరణ్ జోహార్ తో పాటు మరో నలుగురి నిర్మాణంలో కొననసాగుతోంది. కాగా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్షయ్ స్పందిస్తూ.. నటుడిగా సమాజం పట్ల బాధ్యత వహించాలని, తాము నెగెటివ్, పాజిటివ్ పాత్రలు ఉన్న సినిమాలు చేస్తామని, ప్రతి చిత్రంలో మంచి, చెడులు రెండూ ఉంటాయని పేర్కొన్నారు. ప్రేక్షకులు కూడా చాలా తెలివైన వారని ఎలా అర్ధం చేసుకోవాలో వారికి బాగా తెలుసని అన్నారు.
మరోవైపు అక్షయ్ మాట్లాడుతూ తనకు ఏ మతం లేదని ఒక మతం మాత్రమే ఉందని, అది “భారతీయుడు” అని భావిస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని రోజుల్లో రాబోయే చిత్రం సూర్యవంశీ అదే భావాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. ఈ చిత్రం దేశంలో మతపరమైన అశాంతి ఉన్న ప్రస్తుత కాలంలో ఈ చిత్రం మరింత సందర్భోచితంగా ఉంటుందని తెలిపారు.
దర్శకుడు రోహిత్‌తో కలిసి మొదటిసారిగా పనిచేయడంపై అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. రోహిత్‌తో కలిసి పనిచేయడం చాలా సులభమని, ఇద్దరికీ మాద్య కామన్ అడ్వాంటేజ్ ఫాక్టర్ ఉందని అది కామెడీ, యాక్షన్ అని అన్నారు. నేను రోహిత్ శెట్టిని చాలా సంవత్సరాలుగా చూస్తున్నానని, సరదా దర్శకుడని కితాబిచ్చారు. రానున్న 55-60 రోజుల్లో చిత్రం పూర్తి కాబోతుందని అన్నారు.
ఈ చిత్రానికి ప్రఖ్యాత యాక్షన్-దర్శకుడు సునీల్ రోడ్రిగ్స్ హై-ఆక్టేన్ స్టంట్స్ తో కొరియోగ్రఫీ చేసారని, స్టంట్స్ చేసినప్పుడు, ఫైట్ మాస్టర్ డైరెక్టర్ ని విశ్వసించాలని, తనమీద తనకు నమ్మకం ఉండాలని అన్నారు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్, జావేద్ఓ జాఫెరి, జాకీ ష్రాఫ్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..