తెలుగు సినిమా పరిశ్రమలోని యంగ్ హీరోగా వెలుగొందుతున్న హీరో నితిన్...మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు.ప్రజలకు కష్టం వచ్చినప్పుడు .. నేనున్నానంటూ ముందుకొచ్చాడు. గతంలోనూ వరదలు, తుఫాన్ల వంటి ప్రకృతి ముప్పు ఏర్పడినప్పుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు. ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగించాడు.
తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్' క్రమక్రమంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో గుబులు కనిపిస్తోంది. జనం భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు కరోనా కోరలు వంచేందుకు తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. వైద్య సిబ్బంది 24 గంటలు పని చేస్తున్నారు. ఇళ్లల్లో నుంచి ఎవరూ బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. అత్యవసరాలు, నిత్యవసరాలు మినహా అన్ని బంద్ చేశారు. వ్యాపారులు స్వచ్చందంగా దుకాణాలు మూసేశారు. మరోవైపు రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.
లాక్ డౌన్ ఎఫెక్ట్: దళారుల రాజ్యం
కరోనా ముప్పును ఎదుర్కునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భారీగా నిధులు కేటాయించాయి. ఐతే ఈ నిధులు చాలని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రాజకీయ, సినీ ప్రముఖులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఐతే అందరికంటే ముందుగా ''నేనున్నానని'' హీరో నితిన్ ముందుకొచ్చాడు. 'కరోనా వైరస్'ను ఎదుర్కునేందుకు తనవంతు సాయానికి 'సై' అన్నాడు. అనుకున్నదే తడవుగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి 10 లక్షల రూపాయల చొప్పున విరాళాన్ని అందించాడు. కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలవాలని సూచించాడు.
మరికొద్దిరోజుల్లోనే పెళ్లి చేసుకోబోతున్న హీరో నితిన్ ఔదార్యాన్ని అంతా ప్రశంసిస్తున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..