Godfather box office collection Day 2 World Wide: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ కలిసి నటించిన మొట్టమొదటి సినిమా గాడ్ ఫాదర్. మోహన్ రాజా డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాకు తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా మొదటిరోజు పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్ల విషయంలో కాస్త వెనుకంజ వేసినా రెండో రోజున బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నట్లుగా బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో రిలీజ్ అయిన ప్రతి చోటా రెండో రోజు హౌస్ ఫుల్ బోర్డులు పడినట్లుగా వార్తలు అందుతున్నాయి. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ గాడ్ ఫాదర్ సినిమా ముందుకు వెళుతున్నట్లుగా అన్ని జిల్లాల నుంచి రిపోర్టులు అందుతున్నాయి. నిజానికి తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువ సంఖ్యలో గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి 700 పైగా స్క్రీన్ స్లో మాత్రమే సినిమా రిలీజ్ చేశారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 12 కోట్ల 97 లక్షల షేర్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల 7 లక్షల షేర్, 38 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టినట్లుగా అంచనాలైతే ఉన్నాయి.
అమెరికాలో కూడా సినిమా మంచి జోష్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రెండో రోజు అమెరికాలో 500 కే డాలర్లను రాబట్టినట్లుగా తెలుస్తోంది. తద్వారా ఈ సినిమా యూఎస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఉత్తరాదిలో కూడా సల్మాన్ ఖాన్ ఎఫెక్ట్ తో సినిమా మంచి వసూళ్లు రాబట్టినట్లుగా చెబుతున్నారు. మొదటి రోజే సినిమాకి రెండు కోట్ల దాకా నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. ఇక ఆక్యుపెన్సీ కూడా రెండో రోజు బాగుందని, మొదటి రోజు కంటే రెండో రోజే ఎక్కువగా ఆక్యుపెన్సీ కనిపించిందని కొన్నిచోట్ల నుంచి సమాచారం అందుతుంది.
ఇక రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కంటే ఎక్కువగా 18 కోట్ల దాకా షేర్ రాబట్టే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసే అంచనాలే ఉన్నాయి. ఇక సెలవులు కలిసి వస్తూ ఉండడంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
నైజాం: 2.38 కోట్లు
సీడెడ్: 1.96 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.01 కోట్లు
తూర్పు గోదావరి: 51 లక్షలు
పశ్చిమగోదావరి: 45 లక్షలు
గుంటూరు: 60 లక్షలు
కృష్ణా: 49 లక్షలు
నెల్లూరు: 33 లక్షలు
AP-TG మొత్తం:-7.73 కోట్లు (13.35 కోట్ల గ్రాస్)
KA - 2.30 కోట్లు
హిందీ+ROI - 1.80 కోట్లు
OS - 2.55 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – 27.35 కోట్లు (50.35 కోట్లు గ్రాస్)
నోట్: ఇవన్నీ వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సమాచారం. వీటిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.
Also Read: Adipurush 3D Teaser: 3డీలో ఆదిపురుష్ టీజర్.. జండూబామ్ అన్నారంటూ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook