Healthy Food: వాపులు, నొప్పిలతో బాధపడుతున్నారా.. ఇలా తయారు చేసిన జింజర్ వాటర్‌ను తాగండి..!

Ginger Water Benefits: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది పొట్టలో సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా వీటి నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఉత్పత్తులను వాడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 10, 2022, 12:38 PM IST
  • పులు, నొప్పిలతో బాధపడుతున్నారా..
  • జింజర్ వాటర్‌ను తాగండి
  • అన్ని శరీర సమస్యలు దూరమవుతాయి
Healthy Food: వాపులు, నొప్పిలతో బాధపడుతున్నారా.. ఇలా తయారు చేసిన జింజర్ వాటర్‌ను తాగండి..!

Ginger Water Benefits: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది పొట్టలో సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా వీటి నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఉత్పత్తులను వాడుతున్నారు. వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఇంట్లో ఉండే చిట్కాలతో కూడా ఉపశమనం పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా దీని కోసం ప్రతి రోజూ తీసుకునే టీకి బదులుగా అల్లం, గ్రీన్‌ టీని తీసుకోవాలి. అంతేకాకుండా ఆహారపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు. అల్లంతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే ఈ సమస్యలు దూరమవుతాయి.

జింజర్ వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

అల్లం అనేది ఆయుర్వేద శాస్త్రంలో మూలికగా పేర్కొన్నారు. అయితే అల్లాన్ని మెత్తగా రుబ్బుకోని కూరగాయలు లేదా సూప్‌ల్లో వినియోగిస్తే.. శరీరాన్ని వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్లు, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర సమస్యల దూరం చేసేందుకు సహాయపడుతాయి.

జింజర్ వాటర్‌ను ఎలా తయారు చేయాలి:
అల్లం నీటిని తయారు చేయడానికి.. ముందుగా అల్లం ముక్కలను దంచి వేడి నీటిలో ఉడకబెట్టి.. నీరు రంగు మారిన తరువాత ఫిల్టర్ చేయాలి. రుచి కోసం తేనె, నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవచ్చు.

ఈ సమస్యలన్నీ దూరమవుతాయి:

వికారం:
అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల చాలా మంది  వికారం సమస్యలో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యకు జింజర్ వాటర్‌ ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు పొట్టలో సమస్యలను నియంత్రిస్తుంది.

వాపులు, నొప్పిలు తగ్గుతాయి:
జింజర్ వాటర్‌ను క్రమం తప్పకుండా తాగితే.. కండరాలలో నొప్పి తొలగిపోతుంది. అంతేకాకుండా చేతులు, పాదాలు లేదా నడుము నొప్పులను సులభంగా నియంత్రిస్తుంది. ఇలాంటి సమస్యలతో బాధపడే వారు తప్పకుండా ఈ జింజర్ వాటర్‌ తీసుకోవాలని

చెడు కొలెస్ట్రాల్‌ను నియత్రిస్తుంది:
శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి చాలా ప్రభావవంతంగా ఈ జింజర్ వాటర్‌ దోహదపడుతుంది.పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గ్యాస్, హార్ట్ బర్న్ సమస్యలను తొలగిస్తుంది. కావున ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కచ్చితంగా ఈ వాటర్‌ను వినియోగించాలి.

Also Read: PM Modi and Pak Sister: ప్రధాని మోదీకు 25 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాకిస్తాన్ చెల్లెలు.

Also Read: క్యాబ్ డ్రైవర్‌పై 20 మంది దాడి.. కోమాలో బాధితుడు.. డబ్బులు ఇవ్వకపోగా స్నేహితులతో కలిసి దాడి చేసిన నిందితుడు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News