Uttarakhand Govt announces 3 Free LPG Cylinders annually: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నూనె, కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలపై పెనుభారం పడుతోంది. ఈ ప్రతికూల పరిస్థితులలో ప్రభుత్వం పేదలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే రేషన్ కార్డు దారులకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనుంది. అయితే ఈ పథకం మన దగ్గర మాత్రం కాదు.. ఉత్తరఖండ్‌లో.
ఉత్తరఖండ్‌లోని అంత్యోదయ కార్డు హోల్డర్లకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా లభిస్తాయి. ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 55 కోట్లు కేటాయించింది. కేబినెట్ సమావేశం అనంతరం చీఫ్ సెక్రటరీ సుఖ్‌బీర్ సింగ్ సంధు ఈ వివరాలను మీడియాకు వివరించారు. ఉత్తరఖండ్‌లో 1,84,142 అంత్యోదయ కార్డు దారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. ఉచిత సిలిండర్ వల్ల ప్రభుత్వంపై పెను భారం పడుతుందని, అయితే ఈ పథకం చాలా మందికి సహాయంగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
ఉచిత గ్యాస్ సిలిండర్లను పొందాలంటే.. లబ్ధిదారుడు తప్పనిసరి ఉత్తరాఖండ్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి. తప్పనిసరిగా అంత్యోదయ రేషన్ కార్డ్ కలిసి ఉండాలి. అంత్యోదయ రేషన్ కార్డ్.. గ్యాస్ కనెక్షన్ కార్డుతో లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని మీరు పొందాలనుకుంటే.. జూలైలోనే మీ అంత్యోదయ కార్డ్‌ని గ్యాస్ కనెక్షన్ కార్డ్‌తో లింక్ చేయండి. ఇవన్నీ సరిగా ఉంటేనే.. సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందవచ్చు.
ఈ పథకంకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా అంత్యోదయ రేషన్ కార్డుదారుల జాబితాను సిద్ధం చేసి స్థానిక గ్యాస్ ఏజెన్సీలకు పంపింది. ఈ పథకం కింద దాదాపు 2 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు లభించనున్నాయి. దాంతో ప్రభుత్వంపై రూ. 55 కోట్ల వరకు భారం పడనుంది. ప్రస్తుతం ఓ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1100కు పైనే ఉన్న విషయం తెలిసిందే. మూడు సిలిండర్లు అంటే.. రూ. 3300 లబ్దిదారులకు ఆదా కానుంది.
Also Read: టీ20 సిరీస్‌కు కోహ్లీ, బుమ్రా దూరం.. కుల్దీప్ వచ్చేస్తున్నాడు! ఫ్యాన్స్‌కు ఓ గుడ్‌న్యూస్
Also Read: విరాట్ కోహ్లీ ఫామ్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన సౌరవ్ గంగూలీ.. ఏమన్నాడో తెలుసా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook