రంగస్థలం "ఫస్ట్ లుక్" వచ్చేసింది; చెర్రీ స్టిల్ అదుర్స్

రామ్ చరణ్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'రంగస్థలం'. శనివారం చిత్ర యూనిట్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Last Updated : Dec 9, 2017, 07:03 PM IST
రంగస్థలం "ఫస్ట్ లుక్" వచ్చేసింది; చెర్రీ స్టిల్ అదుర్స్

రామ్ చరణ్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'రంగస్థలం'. శనివారం చిత్ర యూనిట్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ మాస్ లుక్‌లో కనిపించాడు. గల్ల లుంగీ, ఎర్ర బనీను, గల్ల చొక్కా వస్త్ర ధారణతో.. ఆనందంతో డాన్స్ చేస్తున్న స్టిల్ అదిరిపోయింది. సినిమా పేరు కూడా అలనాటి క్లాసిక్ మూవీ టైటిల్‌ను గుర్తుచేసేలా ఉంటుంది.

ఇందులో రామ్ చరణ్ కథానాయకుడు. సమంత హీరోయిన్. అనసూయ భరద్వాజా కీలకపాత్ర పోషిస్తున్నారు. జగపతిబాబు, ఆదిపినిశెట్టి తదితరులు నటిస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్. 

 

రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో 'చిట్టిబాబు' అనే పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనుకున్నా.. అనివార్య కారణాలవల్ల  2018 మార్చి 30వ తేదీన విడుదల చేస్తున్నారు

Trending News