మీ డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా చోరీ చేసిందా? లేదా? అనేది తెలుసుకోవడం ఎలా? అనే కొత్త ప్రైవసీ టూల్‌ను ఫేస్‌బుక్ ప్రవేశపెట్టింది. కేంబ్రిడ్జ్ అనలిటికాకు ఎవరెవరి వ్యక్తిగత సమాచారం దొరికిందో తెలుసుకోవడానికి ఈ టూల్‌ను ప్రవేశపెట్టినట్లు ఫేస్‌బుక్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఫేస్‌బుక్ వినియోగదారులంతా మంగళవారం నుంచే తమ ఖాతా న్యూస్‌ఫీడ్‌లో ‘ప్రొటెక్టింగ్ యువర్ ఇన్ఫర్మేషన్’ అనే నోటిఫికేషన్‌ను గమనించొచ్చు.
ఇందులో ఉన్న లింకు ద్వారా యూజర్లు ఏయే యాప్‌లు వాడారు.. వాటితో ఏఏ సమాచారం పంచుకున్నారో తెలుసుకోవచ్చు. డేటా లీక్ కి కారణమైన ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ అనే యాప్‌కు యూజర్లు/ స్నేహితులు లాగిన్ అయ్యారో లేదో కూడా ఈ లింకు సూచించే ప్రత్యేక టూల్ ద్వారా తెలుసుకోవచ్చు. కేంబ్రిడ్జ్ అనలిటికా బారినపడినట్లు భావిస్తున్న 8.7 కోట్ల మందికి ఈ వివరాలతో కూడిన సందేశం వస్తుందని ఫేస్‌బుక్ తెలిపింది.
‘నా డేటా చౌర్యానికి గురైందో లేదో తెలుసుకోవడం ఎలా?’ అనే ప్రైవసీ టూల్‌ను క్లిక్ చేయడం ద్వారా ఆ యూజర్ సమాచారం భద్రమో కాదో తెలుసుకోవచ్చు. ఒకవేళ యూజర్ డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా తీసుకోకపోతే..‘మాకున్న సమాచారం మేరకు.. మీరు, మీ స్నేహితులు డేటా దిస్ ఈజ్ డిజిటల్ లైఫ్‌కు లాగిన్ కాలేదు’ అనే మెసేజ్ కనిపిస్తుంది. ఫేస్‌బుక్ ద్వారా లాగిన్ అయి వాడుకునే వెబ్‌సైట్లు, యాప్‌లను యథావిధిగా వాడుకోవచ్చనే సమాచారం కనిపిస్తుంది. థర్డ్ పార్టీ యాప్స్, డెవలపర్స్ కి మీ వ్యక్తిగత సమాచారం వెళ్ళకుండా ఆపేసేలా ఇక్కడ మీరు డేటా-షేరింగ్ సెట్టింగ్ ను మార్చుకోవచ్చు.
డేటా లీక్ అయిన యూజర్ కు మాత్రం మెసేజ్ వేరేలా కనిపిస్తుంది. ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ యాప్‌ను నిషేధిస్తున్నట్లు ఫేస్‌బుక్ నుంచి వారికి మెసేజ్ వెళ్తుంది. 'గోటు ఆప్ అండ్ వెబ్సైట్స్' ను క్లిక్ చేస్తే హెల్ప్ సెంటర్ పేజ్ కి వెళ్తుంది. అక్కడ మీరు కేంబ్రిడ్జ్ అనలిటికా, ఇతర థర్డ్‌పార్టీ యాప్ లు ఏ వివరాలను సేకరించాయో కనిపిస్తుంది. తమ యాప్ సెట్టింగ్‌లను మార్చుకోవాలనే సూచనలు కనిపిస్తాయి.
ఈ టూల్‌తో మీ ఫేస్‌బుక్ డేటాలీకైందో లేదో తెలుసుకోవచ్చు